దంచి కొడుతున్న వర్షాలు - ఈ జిల్లాలకు బిగ్ అలర్ట్..!!

తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వానలు దంచికొడుతున్నాయి. అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో శని, ఆదివారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. 24 గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం కనిపిస్తోంది. దీంతో, తీర ప్రాంత జిల్లాలను అప్రమత్తం చేసారు. రాయలసీమలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.

భారీ వర్షాలతో
పశ్చిమ మధ్య ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలోని అల్పపీడనం బలపడిందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఇది రాగల 36 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా ఉత్తరాంధ్ర, దక్షిణఒడిశా తీరాల వైపు కదులుతూ వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో శనివారం అక్కడక్కడ భారీ వర్షాలు, ఆదివారం అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగిలినచోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది.

IMD Alerts heavy rainfall over South Coastal Andhra and Telangana Dists for next two days

ఐఎండీ అలర్ట్స్
విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం సహా ఉత్తరాంధ్ర జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉన్నాయి. అల్లూరి జిల్లా కుంతలంలో 45.5, కడప జిల్లా పెద్దపసుపళ్లలో 37, అనకాపల్లి జిల్లా పరవాడలో 35.29, ప్రకాశం జిల్లా ఈదరలో 34.5, నంద్యాల జిల్లా పెద్దదేవళాపురంలో 34, కాకినాడ జిల్లా చొల్లంగిపేటలో 30మిల్లీమీటర్ల గరిష్ట వర్షపాతం నమోదైంది. 124 చోట్ల 10మిల్లీమీటర్లపైన వాన పడింది. కోతకొచ్చిన అపరాల గింజలు తడిసే ప్రమాదం ఉందని వాపోతున్నారు.

మరో రెండు రోజులు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో శని, ఆదివారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావ‌ర‌ణ‌ కేంద్రం హెచ్చరించింది. శనివారం ఆదిలాబాద్‌, కుమురం భీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, జగిత్యాల జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది. అలాగే నిర్మల్‌, నిజామాబాద్‌, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్ద‌పల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌, వరంగల్‌, హనుమకొండ, హైదరాబాద్‌, మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+