Cyclone Michaung: అతి తీవ్ర తుపానుగా మిచౌంగ్- ఐఎండీ ప్రకటన-రేపు అల్లకల్లోలమే .. !

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కాస్తా మిచౌంగ్ తుపానుగా మారింది. అనంతరం ఇవాళ పశ్చిమ బంగాళాఖాతానికి చేరుకుని అతి తీవ్ర తుపానుగా బలపడినట్లు ఐఎండీ ప్రకటించింది. కోస్తాంధ్ర తీర ప్రాంతం ఆనుకుని నెల్లూరు నుంచి బందరు వైపు సాగుతున్న మిచౌంగ్ తుపాను రేపు మధ్యాహ్నం లోపే తీరం దాటే అవకాశమున్నట్లు ఐఎండీ తెలిపింది. దీంతో తీర ప్రాంతంలో అల్లకల్లోలం తప్పేలా లేదు.

ప్రస్తుతం కోస్తాంధ్ర తీరానికి అత్యంత సమీపంలో ఉన్న మిచౌంగ్ తుపాను తీరానికి సమాంతరంగా 10 కిలోమీటర్ల వేగంతో ముందు కదులుతోంది. చెన్నైకి 90 కిలోమీటర్ల దూరంలో, నెల్లూరుకు 120 కిలోమీటర్ల దూరంలో, బాపట్ల తీరానికి 300 కిలోమీటర్ల దూరంలో ఇది ప్రస్తుతం కేంద్రీకృతమైంది. ఇది రేపు ఉదయానికి మరింత తీవ్రంగా మారబోతున్నట్లు ఐఎండీ అంచనా వేస్తోంది. అక్కడి నుంచి మధ్యాహ్నం లోపు బాపట్ల-దివిసీమ మధ్య తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు.

IMD defines Michaung as Super Cyclonic storm, landfall between Nellore-Machilipatnam tomorrow

మిచౌంగ్ తుపాను కారణంగా నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మిగతా కోస్తాంధ్ర జిల్లాల్లోనూ ఓ మోస్తరు వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా తీర ప్రాంతాల్లో భారీ గాలులు వీస్తున్నాయి. ఇప్పటికే దక్షిణ మధ్య రైల్వే దాదాపు 150 రైళ్లను రద్దు చేసింది. రేపు ఈ పెను తుపాను తీరం దాటే సమయంలో భారీ విధ్వంసం తప్పదని అంచనా వేస్తున్నారు. గతంలో ఉప్పెన ఎదుర్కొన్న కృష్ణాజిల్లా దివిసీమ వాసులు ఈసారి తుపాను కారణంగా జరిగే విధ్వంసంపై ఆందోళన చెందుతున్నారు.

బందరు సమీపంలో మిచౌంగ్ తుపాను తీరందాటే అవకాశం ఉండటంతో ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది. అధికారులు ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్ బృందాల సాయంతో ఎలాంటి పరిస్ధితిని అయినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే తుపాను ప్రభావిత జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. తుపాను పరిస్ధితిని బట్టి తీర ప్రాంతాల్లో మత్సకారుల్ని వేటకు వెళ్లకుండా అలర్ట్ చేస్తున్నారు.

తుపాను నేపథ్యంలో ప్రభుత్వం ప్రభావిత జిల్లాలకు ప్రత్యేక అధికారుల్ని నియమించింది. బాపట్లకు కాటమనేని భాస్కర్‌,
బి.ఆర్‌.అంబేద్కర్‌ కోనసీమ జిల్లాకు జయలక్ష్మి, తూర్పుగోదావరికి వివేక్‌ యాదవ్‌, కాకినాడకు యువరాజ్‌, ప్రకాశం జిల్లాకు ప్రద్యుమ్న, ఎస్‌పిఎస్‌ నెల్లూరు జిల్లాకు హరికిరణ్‌, తిరుపతి జిల్లాకు జె.శ్యామలరావు, వెస్ట్‌గోదావరి జిల్లాకు కన్నబాబును ప్రత్యేక అధికారులుగా నియమించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+