రాష్ట్ర ప్రజలకు తియ్యటి శుభవార్త

రాష్ట్రంలో వర్షాలు కొనసాగుతున్నాయి. ఉత్తర అండమాన్‌ సముద్రంలో ఉన్న ఉపరితల ఆవర్తనం బలపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. మరో 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో ఉరుములు, పిడుగులతోపాటు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వర్షం కురుస్తుందని వెల్లడించింది.

చిత్తూరు జిల్లా కుప్పంలో 88 మిల్లి మీటర్లు, అనకాపల్లిలో 60.8, గుంటూరు జిల్లా లాంలో 49, చిత్తూరు జిల్లా శాంతిపురంలో 40.2, పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో 36.4, పార్వతీపురం మన్యం జిల్లా జియ్యమ్మవలసలో 30.2, చిత్తూరు జిల్లా వెంకటగిరి కోటలో 29, విజయనగరం జిల్లా చీపురుపల్లిలో 20 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. ఉత్తరాంధ్రతో పాటుగా రాయలసీమలోని జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవగా, మిగిలిన చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి.

imd

జిల్లాల్లో ఎండలు మాత్రం మండిపోతున్నాయి. ఎండాకాలం ఎండల్లా ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతోపాటు ఉక్కపోతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాలు కురవకుండా ఎండలు మండిపోవడమేంటనే చర్చ అంతటా నడుస్తోంది. సెప్టెంబరులో వర్షాలు కురుస్తాయని భావించినప్పటికీ అందుకు భిన్నమైన వాతావరణం నెలకొంది. ఈ నెలలో మొదటి పదిరోజులు చెదురు మదురుగా వర్షాలు కురిసినప్పటికీ ఉష్ణోగ్రతలు మాత్రం రోజురోజుకు పెరుగుతున్నాయి. తెలంగాణలో కూడా మోస్తరు వానలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. పశ్చిమ దిశ నుంచి రాష్ట్రంవైపు గాలులు వీస్తున్నట్లు చెప్పింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+