Heat wave:ఏపీ వాసులకు అలర్ట్ - నెల రోజులు అప్రమత్తంగా ఉండాల్సిందే..!!
వాతావరణంలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గత వారం వరకు రికార్డు స్థాయి ఉష్ణోగత్రలు..ఇప్పుడు వర్షాలు ప్రభావం చూపిస్తున్నాయి. నాలుగు రోజులుగా పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ సమయంలో వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. వర్షాలు మరి కొద్ది రోజులు కొనసాగే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇదే సమయంలో మే నెలలో ఉష్ణోగ్రతలు మంట పుట్టిస్తాయని, అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. పలు సూచనలు చేసింది.
ఏపీలో ప్రస్తుతం వీస్తున్న తీవ్ర వడగాడ్పులు కోస్తాలో వచ్చే నెలలో కూడా కొనసాగుతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. సాధారణం కంటే ఎక్కువ రోజులు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హెచ్చరించింది. మే నెలకు సంబంధించిన బులెటిన్‌ను భారత వాతావరణ శాఖ విడుదల చేసింది. ఏప్రిల్ నుంచి జూన్ వరకు దేశంలోని అనేక ప్రాంతాల్లో ఎండలు, వడగాడ్పులు వీస్తాయని ఈ నెల ఒకటో తేదీనే ఐఎండీ అంచనా వేసింది.

దీనికి అనుగుణంగా ఈ నెల 10 నుంచి 23 వరకు దేశంలోని అనేక ప్రాంతాల్లో ఎండల తీవ్రత, వడగాడ్పులు ప్రభావం చూపాయి. అదే తీవ్రత వచ్చే నెలలో కొనసాగుతుందని, ప్రత్యేకించి తూర్పు, ఈశాన్య భారతాల్లో ఎండలు, మరికొన్ని ప్రాంతాల్లో వడగాడ్పుల తీవ్రత పెరుగుతుందని తాజా బులెటిన్‌లో పేర్కొంది.
ఏపీలో శుక్రవారం ఎండ తీవ్రత కొనసాగింది. దేశంలోనే అత్యధికంగా అనంతపురంలో 41 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. కాగా వాతావరణ అనిశ్చితితో సాయంత్రానికి మేఘాలు ఆవరించడంతో రాయలసీమలో అక్కడక్కడా వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా ఉరుములు, పిడుగులతో వర్షాలు కురుస్తాయి.
ఈ నెల 30, వచ్చే నెల ఒకటో తేదీల్లో కోస్తా, రాయలసీమల్లో ఎక్కువచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ ఉదయం నుంచి కోస్తా ప్రాంతంలో పలు చోట్ల తేలికపాటి వర్షాలు కురుస్తున్నట్లు సమాచారం అందుతోంది. హైదరాబాద్ లో భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో వర్షం నీరు నిలిచిపోయింది. ఒక చిన్నారి వర్షం నీటిలో మ్యాన్ హోల్ లో పడి గల్లంతు అయింది.
ఇక, ఒడిసా, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, బిహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌లోని తూర్పు ప్రాంతాలు, ఉత్తర ఛత్తీ్‌సగఢ్, గుజరాత్‌లోని కోస్తా ప్రాంతాల్లో సగటు కంటే ఎక్కువ రోజులు వడగాడ్పులు వీస్తాయని అంచనాలు ఉన్నాయి, త్తర కోస్తా, కేరళ, దక్షిణ కర్ణాటక, కోస్తా మహారాష్ట్రలో మే నెలలో సాధారణం కంటే పగటి ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదుకానున్నాయి.
ఏపీ వరకు చూస్తే ఉత్తర కోస్తాలో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా, మిగిలిన ప్రాంతాల్లో సాధారణంగా నమోదుకానున్నాయి. అదే సమయంలో మే నెలలో వాయువ్య, పశ్చిమ, మధ్య భారతాలతోపాటు దక్షిణ భారతంలో ఉత్తర భాగం అంటే ఏపీ, తెలంగాణాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.












Click it and Unblock the Notifications