కుండపోత, మరో రెండు రోజులు - ఈ జిల్లాలకు బిగ్ అలర్ట్..!!
తెలుగు రాష్ట్రాల పై వరుణుడి ప్రతాపం కొనసాగుతోంది. పలు ప్రాంతాల్లో కుండపోత వానలు కొన సాగుతున్నాయి. గుంటూరులో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. హైదరాబాద్ నగరం తడిసి ముద్దయింది. ఏడాది అంచనాలకు మించి వర్షాన్ని ఇచ్చిన నైరుతి రుతుపవనాలు ఆదివారం పశ్చిమ రాజస్థాన్‌లోని పలు ప్రాంతాల నుంచి నిష్క్రమించాయి. అటు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడుతోంది. ఫలితంగా రానున్న నాలుగు రోజులు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
మూడు రోజులు ముందుగానే ఈసారి రుతుపవనాల ఉపసంహరణ ప్రారంభమైంది. మరోవైపు ఆదివారం ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. కాగా, కుండపోత వాన గుంటూరు నగరాన్ని వణికించింది. నగరంలో రెండు గంటల పాటు కుంభవృష్టి వర్షం కురిసింది. భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధాన రహదారులన్నీ చెరువులను తలపించాయి. అదే విధంగా హైదరాబాద్ తడిసి ముద్దైంది. రెండు రాష్ట్రాల్లోనూ అక్కడక్కడా భారీవర్షాలు ముంచెత్తాయి. గుంటూరు జిల్లా వ్యాప్తంగా 50 నుంచి 80 మిమీ వర్షపాతం నమోదైంది. ఇటు సాయంత్రం హైదరాబాద్‌లోనూ భారీ వర్షం కురిసింది. GHMC పరిధిలో మొత్తం 20 నుంచి 40 మిమీ వర్షపాతం నమోదైంది, ముఖ్యంగా జూబ్లీహిల్స్, మాదాపూర్, రాజేంద్ర నగర్, సికింద్రాబాద్, అమీర్‌పేట్‌లో 30 నుంచి 35 మిమీ వర్షం కురిసింది.

నాలుగు రోజులపాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. పిడుగులు కూడా పడతాయని.. జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు అధికారులు. ముఖ్యంగా అల్లూరి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో జోరువానతోపాటు పిడుగులు పడతాయని వెల్లడించింది. తెలంగాణ విషయానికొస్తే.. ఇవాళ రాష్ట్రం మొత్తానికి ఎల్లో అలర్ట్ ఇచ్చింది వాతావరణశాఖ. రాష్ట్రం అంతటా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. రుతుపవన ద్రోణి, అల్పపీడన ప్రభావంతో జోరువాన కురవడంతోపాటు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది. ముఖ్యంగా ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లా్ల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.












Click it and Unblock the Notifications