ఢిల్లీ పోలీసుల భలే ఎత్తుగడ- కాక్రోచ్ ల ముఖాలు లైవ్ స్కాన్

ఢిల్లీలో ఎడతెరిపి లేకుండా కొనసాగుతోన్న కాక్రోచ్ జనతా పార్టీ, లక్షలాది మంది విద్యార్థల ఆందోళనలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. జంతర్ మంతర్ వద్ద ఢిల్లీ పోలీసులు ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీని వినియోగిస్తోండటం, దీనికోసం ప్రత్యేక నిఘా వాహనాలను మోహరింపజేయడం తీవ్ర వివాదాస్పదంగా మారింది. అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరి ముఖాలను కూడా ఈ టెక్నాలజీ ద్వారా లైవ్ స్కాన్ చేస్తోన్నారు ఢిల్లీ పోలీసులు.

దీనిపై కాక్రోచ్ జనతా పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. శాంతియుతంగా తమ నిరసనలు తెలియజేసేందుకు వచ్చే సాధారణ పౌరులు, విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని వారి అనుమతి లేకుండా ముఖాలను లైవ్ స్కాన్ చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ చర్యల పట్ల అటు పౌర హక్కుల సంఘాలు, సామాజిక కార్యకర్తలు సైతం మండిపడుతున్నారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే ప్రాథమిక హక్కును అణచివేసే విధంగా ఈ చర్యలు ఉన్నాయని ఆరోపిస్తున్నారు.

Cockroach Janata Party objects Delhi Police s Facial Recognition Vans at Jantar Mantar New Delhi

నిరసన ప్రదేశాలను తెలియజేసేన ఈ ప్రదేశాన్ని డిజిటల్ ఓపెన్ ఎయిర్ జైలుగా మారుస్తున్నారంటూ కాక్రోచ్ జనతా పార్టీ, పౌర హక్కుల సంఘాల ప్రతినిధులు ధ్వజమెత్తున్నారు. ఎటువంటి చట్టపరమైన అనుమతులు లేదా నిబంధనలు లేకుండానే పౌరుల వ్యక్తిగత బయోమెట్రిక్ వివరాలను ఈ విధంగా సేకరించడం రాజ్యాంగ పరిధిని దాటి వ్యవహరించడమే అవుతుందని వాదిస్తున్నారు. భద్రతా కారణాల పేరుతో శాంతియుత పౌరులపై నిఘా ఉంచడం భయభ్రాంతులకు గురిచేసే వ్యూహంగా కన్పిస్తోందని వ్యాఖ్యానిస్తోన్నారు.

సుప్రీంకోర్టు చారిత్రాత్మక పుట్టస్వామి కేసు తీర్పు ప్రకారం వ్యక్తిగత గోప్యత అనేది ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కు. జంతర్ మంతర్ వంటి బహిరంగ ప్రదేశాల్లో తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడానికి వచ్చే శాంతియుత నిరసనకారులపై ఇలా సామూహికంగా నిఘా పెట్టడం ఈ గోప్యత హక్కుకు పూర్తి విఘాతమని న్యాయ నిపుణులు సైతం విశ్లేషిస్తోన్నారు. అసలు ఏ చట్టపరమైన నిబంధనల ఆధారంగా ఢిల్లీ పోలీసులు ఈ రకమైన నిఘా చర్యలకు పూనుకుంటున్నారో బహిరంగంగా స్పష్టం చేయాల్సిన అవసరం ఉందని అంటున్నారు.

ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫేషియల్ రికగ్నిషన్ అక్కడికక్కడే వ్యక్తులను ఎలా గుర్తిస్తున్నాయనే అంశంపై సాంకేతిక నిపుణులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తోన్నారు. ఆధార్, పాన్ వంటి రికార్డులు, నేషనల్ డేటాబేస్, ఓటర్ ఐడీ, ఇతర నివాస ధృవీకరణ డాక్యుమెంట్లను పోలీసులు ఈ సిస్టమ్ తో తో చట్టవిరుద్ధంగా అనుసంధానం చేస్తూ నిరసనకారుల గుర్తింపును సేకరిస్తున్నారనే అనుమానాలు సైతం బలపడుతున్నాయి.

పోలీసు యంత్రాంగం నిరసన ప్రదేశాల నుంచి సేకరించే ఈ ముఖ గుర్తింపు డేటాను ఎక్కడ భద్రపరుస్తుంది, ఎంతకాలం నిల్వ ఉంచుతుంది, దానికి ఎవరు జవాబుదారీ అనేది మరో ప్రశ్న. భవిష్యత్తులో శాంతియుతంగా నిరసనలు తెలిపే విద్యార్థులను, సామాజిక కార్యకర్తలను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టడానికి లేదా వారిని మానసికంగా ఇబ్బందులకు గురిచేయడానికి ఈ డేటాను ఒక రహస్య నిఘా అస్త్రంగా మలచుకునే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి.

ఇది స్వేచ్ఛా పూరిత ప్రజాస్వామ్య వాతావరణాన్ని దెబ్బతీసే శక్తులకు ఊతమిచ్చే అంశంగా పరిగణిస్తోన్నారు విశ్లేషకులు. శాంతిభద్రతల పరిరక్షణ పేరుతో పౌరుల చట్టబద్ధమైన హక్కులను కాలరాయడం, ఆధునిక సాంకేతికతను ఇంటెలిజెన్స్ టూల్ గా ఉపయోగించడం పౌర స్వేచ్ఛను హరించడమే అవుతుందని మండిపడుతున్నారు. ఈ పరిణామాలపై నియంత్రణలు లేకపోతే భవిష్యత్తులో దేశంలోని ప్రతి నిరసన ప్రాంతం ఓ డిజిటల్ ఓపెన్ ఎయిర్ జైలుగా మారుతుందనే వాదనలూ లేకపోలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+