తెలంగాణాలో మూడురోజుల పాటు వర్షాలు.. నేడు ఈ జిల్లాలలో వరుణ కటాక్షం!

తెలంగాణ రాష్ట్రంలో వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో వాతావరణ పరిస్థితి పైన తాజాగా లేటెస్ట్ అప్డేట్ ఇచ్చింది. ఉత్తర ఈశాన్య జిల్లాలలో నేడు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది.

నేడు ఈ జిల్లాలలో వర్షాలు

నేడు తెలంగాణ రాష్ట్రంలోని ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో కొన్నిచోట్ల వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. పశ్చిమ తెలంగాణలో మెదక్, సంగారెడ్డి, వికారాబాద్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

telangana rains Light to moderate rains with thunderstorms strong winds expected in Telangana districts

హైదరాబాద్ లో నేడు వర్షాలు ఇలా

తూర్పు మరియు ఇతర ప్రాంతాలలో వరంగల్, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలలో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది.హైదరాబాద్ నగరవ్యాప్తంగా నేడు ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని కొన్నిచోట్ల తెలుగు పాట జల్లులు లేదా మోస్తరు వర్షం పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

అన్ని జిల్లాలలో బలమైన ఉపరితల ఈదురుగాలులు

నేడు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలలో గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఉపరితల ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. జులై 26వ తేదీ నుండి 31వ తేదీ వరకు కూడా వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇదిలా ఉంటే గత కొన్ని రోజులుగా రాష్ట్రంలోని అనేక జిల్లాలలో వర్షాలు కురుస్తున్నాయి. అయినప్పటికీ సాధారణ స్థాయితో పోలిస్తే లోటు వర్షపాతమే నమోదవుతున్న పరిస్థితి ఉంది.

రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ఉత్తరాది రాష్ట్రాలకు దూసుకుపోయేలా కొత్త రైల్వేలైన్ రెడీ!
రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ఉత్తరాది రాష్ట్రాలకు దూసుకుపోయేలా కొత్త రైల్వేలైన్ రెడీ!

రైతులకు సూచన

ఋతుపవనాలు విస్తరించి ఉన్నప్పటికీ, ఎల్ నినో పరిస్థితుల కారణంగా వర్షాలు ఆశించిన స్థాయిలో కురవడం లేదు. కనుక నీటి నిల్వల విషయంలో, నీటి వినియోగం విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతం కురుస్తున్న వర్షాలను దృష్టిలో పెట్టుకుని రైతులు వర్షాధార పంటలను వేయొద్దని, ప్రత్యామ్నాయ పంటల సాగు పైన దృష్టి సారించాలని వాతావరణ శాఖ వెల్లడించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+