విద్యాశాఖ నుంచి ధర్మేంద్ర ప్రధాన్ ఔట్..? అక్కడే అసలు ట్విస్ట్..!?

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. ఈ డిమాండ్ తో ఢిల్లీ హోరెత్తుతోంది. విద్యార్ధులు రాజధాని నడి బొడ్డున కదం తొక్కుతున్నారు. కేంద్రం ఈ నిరసనలతో ఉక్కిరి బిక్కిరి అవుతోంది. కాక్రోచ్ పార్టీ డిమాండ్లకు అంగీకారం తెలుపుతూనే.. ఆ ఒక్కటీ మినహా అంటోంది. అదే.. ధర్మేంద్ర ప్రధాన్ తో రాజీనామా. ఆ డిమాండ్ ఆమోదించకుంటే నిరసన ఆగేది లేదని ఉద్యమ కారులు తేల్చేసారు. ఈ రోజు మరోసారి చర్చల వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ధర్మేంద్ర ప్రధాన్ పైన వ్యూహాత్మక నిర్ణయానికి సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది.

ఢిల్లీ నిరసనలతో.. విద్యార్ధులతో హోరెత్తెతోంది. ఇప్పటికే కేంద్రం కాక్రోచ్ పార్టీ ప్రతినిధులతో సంప్రదింపుల ప్రక్రియ ప్రారంభించింది. వారి ప్రధానమైన మూడు డిమాండ్లలో రెండు అమలు కు అంగీకారం తెలిపింది. మూడోది.. కీలకమైనది ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా. ఈ డిమాండ్ వద్దనే ప్రస్తుతం ప్రతిష్ఠంభన ఏర్పడింది. ఇప్పటికే ఎన్టీఏలో 47 మంది అధికారుల పైన వేటు వేసారు. ఉన్నత స్థాయి వ్యవస్థలను మార్పు చేస్తున్నారు. మంత్రి రాజీనామా మినహా పూర్తి మార్పులు చేస్తూ.. తాజాగా కేంద్ర కేబినెట్ లో బిల్లును ఆమోదించారు.

centre-holds-key-consultations-as-pressure-mounts-over-dharmendra-pradhans-resignation-here-the-re

అయితే, మంత్రికి ఈ లీక్ వ్యవహారం లో ప్రమేయం లేదని కేంద్రం భావిస్తోంది. తొలి నుంచి ఆరెస్సెస్ లో.. ఆ తరువాత బీజేపీలో కీలక నేతగా ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ పార్టీ వ్యూహకర్తల్లో ఒకరు. ఒత్తిడి లొంగి మంత్రితో రాజీనామా చేయిస్తే.. భవిష్యత్ లోనూ ఇదే ఒక విధానంగా మారే అవకాశం ఉందని కేంద్రంలోని ముఖ్యులు భావిస్తున్నారు. ఇప్పుడు విపక్షాలు విద్యార్ధులకు మద్దతుగా నిలవటంతో.. ధర్మేంద్ర ప్రధాన్ తో రాజీనామా చేయిస్తే.. అది తమ విజయంగా విపక్షాలు ప్రచారం చేసుకునే అవకాశం ఉంటుంది.

నేడు కీలక చర్చలు.. నిర్ణయాలు

నీట్ లీక్ వ్యవహారంతో ప్రభుత్వం తమ తప్పు ఉందని అంగీకరించినట్లుగా భావిస్తారనే చర్చ ఢిల్లీ వర్గాల్లో జరుగుతోంది. గతంలో వ్యవసాయ చట్టాల పైన రైతులు సుదీర్ఘ కాలం ధర్నాలు చేసారు. మోదీ అప్పుడు క్షమాపణ చెప్పి.. చట్టాలను రద్దు చేసారు. ఇప్పుడు తీసుకుంటున్న దిద్దుబాటు చర్యలు ధర్మేంద్ర ప్రధాన్ ద్వారానే ఆయన శాఖలో చేయిస్తున్నారు. వ్యవస్థాగత తప్పులకు మంత్రిని బలిపశువును చేయడం సరి కాదనే అభిప్రాయంతో ఉన్నట్లు తెలుస్తోంది.

అయితే, తాత్కాలికంగా మంత్రి శాఖలను మరొకరికి బదలాయించి.. శాఖల మార్పు ద్వారా ప్రస్తుత ఉద్రిక్తత కు ముగింపు పలకాలనే ఆలోచన తెర మీదకు వచ్చింది. త్వరలోనే కేంద్ర కేబినెట్ ప్రక్షాళనలో ధర్మేంద్ర ప్రధాన్ శాఖ మార్పు పైన ఇప్పటికే నిర్ణయం జరిగిందని చెబుతున్నారు. అయితే, ఈ పరిస్థితుల్లో వేటు కంటే మార్పు మంచిదనే ఆలోచన చేస్తున్నారు. దీంతో.. ఈ రోజు జరిగే రెండో విడత చర్చల్లో కేంద్రం ధర్మేంద్ర ప్రధాన్ తొలిగింపు పై ఏం చెబుతుందనేది కీలకంగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+