వాతావరణంలో ఆకస్మిక మార్పులు - తాజా అలర్ట్స్, ఇక ఇలా..!!
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణంలో అనూహ్య మార్పులు వస్తున్నాయి. వేసవి ప్రారంభంలోనే భిన్న మైన వాతావరణం కనిపిస్తోంది. రాత్రి నుంచి ఉదయం వరకు మంచు కురుస్తోంది. ఆ తరువాత ఎండల తీవ్రత కొనసాగుతోంది. వాతావరణంలో చోటు చేసుకుంటున్న ఆకస్మిక మార్పుల పైన తాజాగా హెచ్చరికలు జారీ అవుతున్నాయి. అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. మార్చి 15 తరువాత ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలు దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
భిన్న వాతావరణం
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం లో ఆకస్మిక మార్పు మొదలైంది. అటు మంచు.. ఇటు ఎండ వేడి తో భిన్నమైన పరిస్థితి కొనసాగుతోంది. క్రమేణా వేసవి ప్రభావం కనిపిస్తోంది. శివరాత్రి తరువాత ఎండ తీవ్రత పెరుగుతోంది. ఈ వేసవిలో పాత రికార్డులు తిరగరాసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేస్తోంది. మార్చి 15 తరువాత మరింతగా వేడి పెరుగుతుందని చెబుతున్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో 50 డిగ్రీలు దాటే అవకాశం ఉందని వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో వస్తున్న మార్పులే ప్రస్తుత పరిస్థితికి కారణంగా వివరించారు. ఫిబ్రవరిలో గడిచిన 13 రోజుల్లో దేశంలోని అనేక ప్రాంతాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ 13 రోజుల్లో 11 రోజులు దేశంలోనే అత్యధిక పగటి ఉష్ణోగ్రతలు మన రాష్ట్రంలోనే నమోదయ్యాయి.

పెరగనున్న ఎండలు
రానున్న రోజుల్లో ఎండ తీవ్రత పెరిగి, ఉష్ణోగ్రతల్లో కొత్త రికార్డులు నమోదవుతాయని వాతావరణ శాఖ అధికా రులు వెల్లడించారు. రాత్రి వాతావరణం వేడిగా ఉంటుందని విశ్లేషించారు. పసిఫిక్ మహాసముద్రంలో లానినా కొనసాగుతోంది. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదవుతున్నాయి. ఈ ఏడా ది ఏప్రిల్ వరకు లానినా కొనసాగుతుందని వాతావరణ శాఖ బులెటిన్‌లో పేర్కొంది. ఇక, వాతావరణ మార్పు ల నేపథ్యం లో ఉష్ణోగ్రతలపై ఎల్‌నినో పరిస్థితులు ప్రస్తుతం ప్రభావం చూపే అవకాశం తక్కువగా ఉందని అంచనా వేస్తున్నారు. భూమధ్యరేఖ సమీపాన లానినా కొనసాగితే వచ్చే నైరుతి రుతు పవనాలపై ప్రభావం ఉంటుందని.. దీని కారణంగా మంచి వర్షాలు పడతాయని చెబుతున్నారు.
రికార్డు ఉష్ణోగ్రతలు
గత ఇరవై ఏళ్ల నుంచి వేసవిలో ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే రెండు మూడేళ్లు తప్ప మిగిలిన సంవత్సరాల్లో కొత్త రికార్డులు నమోదయ్యాయని వాతావరణ శాఖ అధికారులు గుర్తు చేస్తున్నార. ఉత్తరాదిలో కొన్నిచోట్ల 50 డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే మార్చి నెల 15వ తేదీ తర్వాత ఎండలు బాగా పెరుగుతాయని స్పష్టం చేస్తున్నారు. దీని ద్వారా తద్వారా ప్రీమాన్‌సూన్ వర్షాలు సంభవిస్తాయని విశ్లేషించారు. ప్రస్తుతం మంచు - ఎండతో ఎదుర్కొంటున్న భిన్నమైన వాతావరణ పరిస్థితుల్లో తగిన ఆరోగ్య పరమైన జాగ్రత్తలు అవసరమని సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications