ముంచుకొస్తున్న మరో ముప్పు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!!
ఏపీని వర్షాలు వీడటం లేదు. వరుసగా ఏర్పడుతున్న అల్ప పీడననం .. తుఫాన్ల తో కోస్తా తీరం పై ప్రభావం పడుతోంది. గత పది రోజులుగా ఫెంగల్ తుఫానుతో నెల్లూరు, చిత్తూరు ఉమ్మడి జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదైంది. ఇప్పుడు తాజాగా మరో ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. ఆగ్నేయ బంగాళాఖాతంతో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఈ ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందని హెచ్చరించింది.
ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడి నట్లు వాతావరణ శాఖ వెల్లడిం చింది. దీని ప్రభావంతో శనివారం నాటికి దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశ ముందని అంచనా వేసింది. పశ్చిమ వాయవ్యంగా పయనించే క్రమంలో బలపడుతూ 12నాటికి తమిళనాడు, శ్రీలంక తీరాల దిశగా వస్తుందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఇది మరింతగా వాయుగుండంగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో 11 నుంచి రాయలసీమ, దక్షిణ కోస్తాల్లో వర్షాలు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు.

దీంతో, 12న అక్కడక్కడా భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఫెంగల్ తుఫాను కారణంగా ఉమ్మడి చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో వరుసగా భారీ వర్షాలు కురిసాయి. తిరుపతి, తిరుమల లోనూ ప్రభావం చూపింది. తిరుమలలో జలాశయాలు అన్నీ నిండుకున్నాయి. ఇప్పుడు మరోసారి అల్పపీడన ద్రోణి, రానున్న నాలుగు రోజుల్లో కోస్తా జిల్లాలకు భారీ వర్ష సూచనతో మరో సారి అధికార యంత్రాంగం అప్రమత్తం అవుతోంది. భారీ నష్టాలతో ఇప్పటికే పంటలకు పెద్ద మొత్తంలో నష్టం జరిగింది.












Click it and Unblock the Notifications