ముంచుకొస్తున్న మరో ముప్పు, మళ్లీ కుండపోత - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరిక..!!

తెలుగు రాష్ట్రాలకు వర్షాలు వీడటం లేదు. భారీ వర్షాలతో పలు ప్రాంతాలు జల దిగ్భందనంలో చిక్కుకున్నాయి. ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నాయి. ఇదే సమయంలో వాతావరణ శాఖ మరో బిగ్ అలర్ట్ ఇచ్చింది. బంగాళాఖాతంలో రెండు అల్ప పీడనాలు ఏర్పడనున్నాయి. ఈ ప్రభావంతో మరో సారి భారీ వర్షాలు తప్పవని అంచనా వేస్తోంది. కామారెడ్డితో పరిస్థితి క్రమేణా మెరుగవుతోంది. తాజా అల్పపీడనాలతో ఏపీలోని పలు జిల్లాలకు భారీ వర్ష హెచ్చరికలు జారీ అయ్యాయి.

బంగాఖాతంలో వరుస అల్పపీడనాలు ఏర్పడేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని విపత్తుల నిర్వహణ శాఖ వెల్లడించింది. సెప్టెంబర్ 3 నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని... ఆ తరువాత అది పశ్చిమ వాయవ్య దిశగా పయనించి, సెప్టెంబర్ 5 నాటికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. సెప్టెంబర్ రెండో వారంలో వాయవ్య బంగాళాఖాతంలో మరో అల్ప పీడనమూ ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. దీంతో, వచ్చే మంగళ.. బుధవారాల్లో రాష్ట్రంలోని ఉత్తర కోస్తాలోని పలు ప్రాతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో.. అధికారులు అప్రమత్తం అయ్యారు. వాతావరణ శాఖ అంచనాల మేరకు నిర్ణయాలు తీసుకుంటున్నారు.

imd-predicts-two-low-depressions-to-form-over-bay-of-bengal-in-next-week

కాగా, ఏపీలో ఇప్పటికీ పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. వర్ష బీభత్సానికి రహదారులు కొట్టుకుపోయాయి. వాగులు, నదులు, చెరవులు పొంగిపొర్లుతున్నాయి. ప్రాజెక్టులకు భారీగా వరద ప్రవహిస్తుంది. అల్పపీడన ప్రభావంతో ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి వరద ఉధృతి పెరుగుతుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

భద్రాచలం వద్ద ప్రస్తుతం 46.8 అడుగులు నీటిమట్టం ఉంది. కూనవరం వద్ద 18.10 మీటర్లు, పోలవరం వద్ద 11.71 మీటర్లు, ధవళేశ్వరం వద్ద ఇన్&ఔట్ ఫ్లో 7.99 లక్షల క్యూసెక్కులుగా ప్రవాహిస్తుంది. ఈ నేపథ్యంలో ఇవాళ(శనివారం) మొదటి హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉందని అధికారులు వెల్లడిచారు. సహాయక చర్యలకు 6 SDRF బృందాలను సిద్ధం చేసారు. కృష్ణానది వరద ప్రవాహం నిలకడగా ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+