విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ ను చికాకుపెడుతున్న ఆ మీడియా- త్వరలో ఫైబర్ నెట్ ఛానల్ -పరిమితులివే ?

|
Google Oneindia TeluguNews

ఏపీలో వైసీపీ వర్సెస్ టీడీపీగా సాగుతున్న పొలిటికల్ వార్ పతాకస్ధాయికి చేరుకుంది. అదే సమయంలో టీడీపీకి ఎప్పటి నుంచో అండగా ఉంటున్న కొన్ని ఛానళ్లు, పత్రికలు నిత్యం జగన్ సర్కార్ ను చికాకు పెడుతున్నాయి. వీటిని కౌంటర్ చేసే విషయంలో ప్రభుత్వాధినేత జగన్ చేతిలోనే ఉన్న సాక్షి ఛానల్, పత్రిక ఏమాత్రం సరిపోవడం లేదు. దీంతో ఎల్లో మీడియాకు ప్రత్యామ్నాయాల కోసం అన్వేషిస్తున్న ప్రభుత్వం.. తమ జేబు సంస్ధ అయిన ఫైబర్ నెట్ సాయంతో కొత్త వ్యూహం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.

జగన్ వర్సెస్ మీడియా

జగన్ వర్సెస్ మీడియా

ఏపీలో వైసీపీ అధికారంలోకి రాకముందు నుంచే, ఇంకా చెప్పాలంటే జగన్ తండ్రి వైఎస్సార్ సీఎం కాకముందు నుంచే వీరి ప్రత్యర్ధి అయిన టీడీపీకి మీడియా అండదండలు పూర్తిగా ఉన్నాయి. టీడీపీ అధికారంలో ఉంటే ఒకలా, వైసీపీ, కాంగ్రెస్ అధికారాల్లో ఉంటే మరోలా వార్తలు వండివార్చడం ఈ మీడియా సంస్ధలకు, వాటి అధిపతులకు అనివార్యతగా మారిపోయింది. దీంతో మూడేళ్ల క్రితం ఏపీలో అధికారంలోకి వచ్చిన వైసీపీ సర్కార్ పైనా అదే స్ధాయిలో ఈ మీడియా సంస్ధలు వార్తలు వండివారుస్తున్నాయి. దీంతో ఈ వ్యవహారం రానురానూ జగన్ కు చికాకుపెడుతోంది. ముఖ్యంగా ప్రజల్లో పాపులారిటీ పెంచుకునేందుకు ప్రభుత్వం భారీ ఎత్తున అమలు చేస్తున్న సంక్షేమ ఫలాలు కూడా చాలాసార్లు ప్రభుత్వానికి లభించని పరిస్ధితి. దీంతో కొంతకాలంగా జగన్ ప్రతీ బహిరంగసభలోనూ ఎల్లోమీడియా తీరును ఎండగడుతూనే ఉన్నారు.

 ప్రత్యామ్నాయాల వేట

ప్రత్యామ్నాయాల వేట

ఓవైపు వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చెలరేగిపోతున్న ఎల్లో మీడియా, మరోవైపు దానికి సరైన కౌంటర్లు ఇవ్వడంలో సాక్షి పోటాపోటీ ఇవ్వలేకపోవడం జగన్ ను కలవరపెడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో సహజంగానే జగన్ ప్రత్యామ్నాయాల్ని ప్రోత్సహించే పనిలో పడ్డారు. ఇప్పటికే కొన్ని ప్రధాన మీడియా సంస్ధల్ని ప్రోత్సహిస్తున్నప్పటికీ, అవి ఎన్నికల నాటికి పూర్తిగా వైసీపీని సమర్ధించే పరిస్ధితి లేదు. అంతే కాదు ఎవరు అధికారంలో ఉంటే వారికి బాకా ఊది, ఎన్నికలు రాగానే తటస్ధ రాగాలు వినిపించే ఆయా మీడియా సంస్ధలతో ప్రయోజనం లేదని జగన్ భావిస్తున్నారు. దీంతో తాజాగా ఓ కొత్త శాటిలైట్ ఛానల్ ను ప్రోత్సహించడం మొదలుపెట్టేశారు. ఇప్పుడు మరిన్ని ప్రత్యామ్నాయాల వేటలో పడ్డారు.

త్వరలో ఫైబర్ నెట్ కొత్త ఛానల్

త్వరలో ఫైబర్ నెట్ కొత్త ఛానల్

రాష్ట్రంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో మనటీవీ పనిచేస్తోంది. అలాగే డీడీ సప్తగిరి ఛానల్ కూడా ప్రభుత్వ కార్యక్రమాల్ని ముందుకు తీసుకెళ్తున్నాయి. అయితే ఈ రెండు ఛానళ్లూ రెగ్యులర్ ప్రైవేట్ శాటిలైట్ ఛానళ్ల ప్రొఫెషనలిజాన్ని అందిపుచ్చుకోలేని పరిస్ధితుల్లో ఉన్నాయి. దీంతో మరో ప్రభుత్వ సంస్ధ ఏపీ ఫైబర్ నెట్ సాయంతో కొత్త ఛానల్ ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో సమావేశమైన ఫైబర్ నెట్ బోర్డు.. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం కొత్త శాటిలైట్ ఛానల్ ప్రతిపాదనల్ని ఆమోదించింది. త్వరలో ప్రైవేట్ ఛానళ్లకు దీటుగా ఓ కొత్త ఛానల్ తెచ్చేందుకు ఫైబర్ నెట్ ప్రయత్నిస్తోంది. అంతే కాదు ..దీనికి ప్రేక్షకుల్ని కూడా పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది.

ఫైబర్ నెట్ ఛానల్ పరిమితులివే ?

ఫైబర్ నెట్ ఛానల్ పరిమితులివే ?


ఏపీ ఫైబర్ నెట్ ఆధ్వర్యంలో ప్రారంభించే కొత్త ఛానల్ ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాల్ని భారీ ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాలని వైసీపీ సర్కార్ భావిస్తోంది. అంతవరకూ బాగానే ఉన్నా.. రాజకీయ ప్రత్యర్ధులపై విమర్శలు, వారిని ఎండగట్టే ప్రయత్నాలు చేయడం మాత్రం సాధ్యం కాకపోవచ్చు. ప్రైవేట్ ఛానళ్లకు ఉన్న వార్త ప్రసార స్వేచ్ఛ దానికి ఉండకపోవచ్చు. ప్రైవేటు ఛానళ్లకు దీటుగా నిలబడాలంటే, జనంలోకి చొచ్చుకుపోవాలంటే కంటెంట్ మాత్రమే కాదు భారీ ఎత్తున నిధులు వెచ్చించి ప్రమోట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇదంతా సాధ్యమవుతుందా అంటే చెప్పలేని పరిస్ధితి. అంతే కాదు రాజకీయ ప్రత్యర్ధులపై ఇందులో సాగించే ప్రచారాన్ని రేపు వారు కోర్టుల్లో సవాల్ చేస్తే ప్రభుత్వం ఇరుకునపడటం ఖాయం. ఆ పరిస్దితిని ప్రభుత్వం ఎలా కౌంటర్ చేస్తుందనే దానిపైనే ఈ ఛానల్ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. లేకపోతే మరో మన టీవీ కావడం ఖాయం.

English summary
ysrcp govt has planned to launch a new news channel in andhrapradesh to counter yellow media.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X