RK Roja Record : రోజాను ఒకేసారి ఫొటో తీసిన 3 వేల మంది ఫొటోగ్రాఫర్స్-కారణమిదే..
ఏపీలో గతంలో టాలీవుడ్ నటిగా, ఆ తర్వాత వైసీపీ ఎమ్మెల్యేగా, జబర్తస్త్ హోస్ట్ గా పలు పాత్రల్లో హంగామా చేసిన ఆర్కే రోజా తాజాగా జగన్ కేబినెట్ మంత్రి కూడా అయ్యారు. దీంతో ఆమె జబర్తస్త్ షో కూడా వదులుకున్నారు. అయితే వీలు చిక్కినప్పుడల్లా పర్యాటక మంత్రిగా పలు చోట్ల తనదైన శైలిలో హంగామా చేస్తున్నారు. ఇవాళ విజయవాడలోనూ అలాంటిదే ఓ ఘటన చోటు చేసుకుంది.
ఇవాళ విజయవాడలో జరిగిన ఓ కార్యకర్మంలో పర్యాటక మంత్రి రోజాను ఒకే క్లిక్ తో 3వేల మంది ఫొటో గ్రాఫర్స్ ఫోటో తీశారు. విజయవాడ ఎస్ ఎస్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన ఫోటో గ్రఫ్రీ కార్నివాల్, ఫొటో గ్రఫీ ఎక్స్పోలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ కార్నివాల్ లో సందడి చేసిన మంత్రి రోజాను ఫోటోగ్రాఫర్స్ .. లేటెస్ట్ కెమెరాలతో ఫొటోలు తీశారు. రికార్డు కోసం రోజాను వీరంతా కలిసి ఒకేసారి ఈ ఫొటో తీసినట్లు తెలిసింది. ఈ దృశ్యాల్ని రోజా తన ఫోన్ లో బంధించారు. ఇప్పుడు ఈ వీడియో కూడా వైరల్ అవుతోంది.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన రోజా తన సినీ కెరీర్ విషయాల్ని పంచుకున్నారు. ఒక ఫొటో గ్రాఫ్ తో మొదలైన తన జీవితం అంచేలంచెలుగా ఎదిగేలా చేసిందని రోజా తెలిపారు. ఒకే వేదికపైకి అన్ని ఫొటోగ్రఫీ సంస్థలు రావడం ఆనందంగా ఉందన్నారు. మెట్రో పాలిటన్ సిటీలకు పరిమితం అయిన ఫొటోగ్రఫి ఎక్స్ పోలు ఏపీలో ఏర్పాటు చేయడం అనందంగా ఉందని రోజా పేర్కొన్నారు. ఒకే క్లిక్ తో 3వేల మంది ఫొటో గ్రాఫర్స్ ఫొటో తియ్యడం గొప్ప ఒక అనుభూతన్నారు. కళ్లకు కట్టినట్లు సృజనాత్మకతను వెలికి తీయడంలో ఫొటో గ్రాఫర్లు, వీడియో గ్రాఫర్స్ ది కీలక పాత్ర అని రోజా తెలిపారు.
రోజాను ఒకేసారి ఫొటో తీసిన 3 వేల మంది ఫొటోగ్రాఫర్స్#Roja #Ysrcp #Apgovt pic.twitter.com/D0bf8UCj1I
— oneindiatelugu (@oneindiatelugu) July 30, 2022












Click it and Unblock the Notifications