వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫస్ట్ నుంచి హైయర్ ఎడ్యుకేషన్ కూడా.. స్టార్ట్ చేస్తామని ఏపీ సర్కార్ స్పష్టీకరణ

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ వల్ల విద్యా సంస్థలు మూతపడ్డాయి. కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ విద్యా సంస్థలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలో అక్టోబరు 1 నుంచి ఉన్నత విద్యాసంస్థలను పునఃప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉమ్మడి అకడమిక్‌ కేలండర్‌ను విడుదల చేసింది.

డిగ్రీ, పీజీ కాలేజీల్లో అక్టోబరు 1వ తేదీ నుంచి సెమిస్టర్‌-1,3,5 తరగతులు ప్రారంభం అవుతాయి. జనవరి 24 నుంచి పరీక్షలు నిర్వహిస్తారు. ఫిబ్రవరి 15వ తేదీ నుంచి సెమిస్టర్‌-2,4,6కు సంబంధించిన తరగతులు జరుగుతాయి. జూన్‌ 1వ తేదీ నుంచి పరీక్షలు జరుగనున్నాయి. రెండో సెమిస్టర్‌ తర్వాత కమ్యూనిటీ సర్వీస్‌ ప్రాజెక్టుకు, నాలుగో సెమిస్టర్‌ తర్వాత వేసవి ఇంటర్న్‌షిప్‌, అప్రెంటిస్‌షిప్‌కు 8 వారాల సమయం ఉంటుంది.

in ap state higher education starts on october 1st

బీటెక్‌, బీ ఫార్మసీ కోర్సులకు అక్టోబరు 1వ తేదీ నుంచి సెమిస్టర్‌-1,3,5,7కు సంబంధించిన తరగతులు నిర్వహిస్తారు. జనవరి 24 నుంచి సెమిస్టర్‌-3 పరీక్షలు జరుగనున్నాయి. ఫిబ్రవరి 7వ తేదీ నుంచి సెమిస్టర్-1,5,7 ముగింపు పరీక్షలు నిర్వహించనున్నారు. మార్చి1వ తేదీ నుంచి సెమిస్టర్‌-2,6,8 కు సంబంధించిన తరగులు పునఃప్రారంభం అవుతాయి. జూన్‌ 23వ తేదీ నుంచి ముగింపు పరీక్షలు నిర్వహిస్తారు.

ఫిబ్రవరి 15వ తేదీ నుంచి నాలుగో సెమిస్టర్‌ ప్రారంభం కానుంది. జూన్‌ 1వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. నాలుగో సెమిస్టర్‌ తర్వాత కమ్యూనిటీ సర్వీసు ప్రాజెక్టుకు 8 వారాల సమయం ఉంటుంది. పీజీ కోర్సులకు నవంబరు ఒకటి నుంచి తరగతులు ప్రారంభించనున్నారు. మార్చి 1వ తేదీ నుంచి సెమిస్టర్‌-1,3,5 పరీక్షలు నిర్వహిస్తారు. మార్చి 14వ తేదీ నుంచి 2,4,6 తరగతులు ప్రారంభించనున్నారు. జులై 4వ తేదీ నుంచి ముగింపు పరీక్షలు జరుగనున్నాయి.

కరోనా వల్ల పిల్లల అకడమిక్ ఈయర్ గడిచిపోతూనే ఉన్నాయి. వరసగా రెండుసార్లు అందరినీ పాస్ చేశారు. సీబీఎస్ఈ కూడా ఇంటర్నల్ ఆధారంగా మార్కులను కేటాయించింది. సెకండ్ వేవ్ తగ్గిన తర్వాత.. ఇప్పుడిప్పుడే కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో స్కూల్స్ మెల్లగా తెరిచారు. ఇక హైయర్ ఎడ్యుకేషన్ కూడా రెగ్యులర్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ మేరకు ఏపీ సర్కార్ అకడమిక్ ఇయర్ క్యాలెండర్ ప్రకటించింది.

English summary
october 1st onwards higher education institutions start in andhra pradesh state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X