విశాఖ కాపునాడు భేటీలో ట్విస్ట్-వైసీపీ నేతల్ని వెళ్లొద్దన్న జగన్ ? కారణమిదే.. !
విశాఖలో ఇవాళ కాపు నేతలు నిర్వహిస్తున్న కాపునాడు సభకు వైసీపీ దూరంగా ఉండబోతోంది. కాపు సీఎం డిమాండ్ దిశగా అడుగులేస్తున్న ఈ సామాజిక వర్గ నేలు పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల నేతల్ని దీనికి ఆహ్వానించారు. అయితే ఈ సభకు దూరంగా ఉండాలని వైసీపీ చివరి నిమిషంలో నిర్ణయం తీసుకుంది.
ఏపీలో మారుతున్న రాజకీయ పరిస్దితుల్లో కాపులకు సీఎం పదవి ఇవ్వాలనే డిమాండ్ తో రాజకీయపార్టీలపై ఒత్తిడి పెంచేందుకు కాపునాడు నేతలు సిద్దమవుతున్నారు. అయితే నేరుగా ఈ డిమాండ్ వినిపించే పరిస్ధితి వారికి లేదు కాబట్టి కాపు నాడు సభ పేరుతో రాధా-రంగా రాయల్ అసోసియేషన్ మద్దతుతో విశాఖలో ఈ సభ నిర్వహిస్తున్నారు. విశాఖలో నిర్వహించే ఈ సభ కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభకు అన్ని పార్టీల్లోని కాపు నేతలు పార్టీలకు అతీతంగా హాజరై కాపు డిమాండ్లు వినిపిస్తారని అంతా భావిస్తున్న తరుణంలో వైసీపీ ట్విస్ట్ ఇచ్చింది. ఈ సభకు వైసీపీలోని కాపు నేతల్ని వెళ్లొద్దని ఆదేశించినట్లు సమాచారం.

వైసీపీ కాపు నేతలు కాపునాడు సభకు వెళితే అక్కడ కాపు నేతలంతా తమ సామాజిక వర్గానికి సీఎం పదవి ఇవ్వాలని డిమాండ్ చేసే అవకాశం ఉంది. కానీ వైసీపీలో ఉన్న కాపు నేతలు ఆ డిమాండ్ చేసే పరిస్దితి లేదు. దీంతో వారు అక్కడికి వెళితే ఇబ్బందికరమైన పరిస్ధితులు ఎదురుకావొచ్చని వైసీపీ హైకమాండ్ అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో కాపు నాడు సభకు దూరంగా ఉండాలని జగన్ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు తాము మాత్రం అన్ని పార్టీల్లోఉన్న కాపు నేతల్ని ఈ సభకు హాజరుకావాలని ఆహ్వానించామని, రాకపోతే వారిష్టమని కాపు నేతలు చెప్తున్నారు.












Click it and Unblock the Notifications