గద చేతపట్టిన కెసిఆర్: తమకే పట్టంకట్టాలని..(పిక్చర్స్)

కరీంనగర్: తెలంగాణ కోసం పోరాడిన పార్టీకే వచ్చే ఎన్నికల్లో పట్టం కట్టాలని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖర్ రావు అన్నారు. ఆయన కరీంనగర్‌లో శ్రీరాజరాజేశ్వర డిగ్రీ కళాశాల మైదానంలో జరిగిన టిఆర్ఎస్ ఎన్నికల శంఖారావం బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. కత్తి ఒకరికి ఇచ్చి యుద్ధం మరొకరిని చేయమనడం ధర్మం కాదని అన్నారు. తెలంగాణ కోసం పోరాటం చేసింది ఎవరో గుర్తించాలని ప్రజలను కోరారు.

ఒకవైపు కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేస్తూనే ఎన్డీఏ కూటమిలో చేరబోమని కెసిఆర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. తమ పార్టీ తృతీయ కూటమిలో భాగస్వామి అవుతుందని, కూటమి నేతలతో మాట్లాడుతున్నానని అన్నారు. తెలంగాణ ప్రజలు తమ తలరాతలు తామే రాసుకునే సమయం వచ్చిందని, అందుకే ప్రజలు అప్రమత్తంగా ఉండి ఉద్యమ పార్టీ టిఆర్ఎస్‌ను ఈ ఎన్నికల్లో గెలిపించాలని కోరారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినా ఆంధ్రావాళ్లా పాలన ఇంకా అవసరమా అని ఆయన ప్రశ్నించారు.

తెలంగాణ పునర్నిర్మాణంలో పాలు పంచుకోవడానికే తమ పార్టీ అధికారం కోరుతున్నదని చెప్పారు. ఈ ఎన్నికల్లో అసెంబ్లీకి, లోక్‌సభకు రెండు ఓట్లు తమ పార్టీకి వేసి తమ అభ్యర్థులందరిని గెలిపించాలని అన్నారు. తెలంగాణ ప్రభుత్వంలో అమరుల కుటుంబాలను గుండెల్లో పెట్టుకుంటామని హామీ ఇచ్చారు.
కాంగ్రెస్ పార్టీలో తెరాసను విలీనం చేయొద్దని తెలంగాణ సమాజమే కోరినట్టు ఆయన తెలిపారు.

అధికారంలోకి వచ్చిన తర్వాత గోదావరి, కృష్ణా జలాలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవడానికి ప్రాజెక్టులు నిర్మిస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చిన మూడేళ్ల కల్లా 24 గంటల పాటు కరెంట్ ఇచ్చే స్థాయికి చేరుకుంటామని, ఆ బాధ్యత తనదని హామీ ఇచ్చారు. తాము తమ మేనిఫెస్టోలో చేర్చిన ప్రతీ అంశాన్ని అధికారంలోకి వచ్చిన తర్వాత చిత్తశుద్ధితో అమలు చేస్తామని చెప్పారు.

కెసిఆర్ అభివాదం

కెసిఆర్ అభివాదం

తెలంగాణ కోసం పోరాడిన పార్టీకే వచ్చే ఎన్నికల్లో పట్టం కట్టాలని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖర్ రావు అన్నారు. కత్తి ఒకరికి ఇచ్చి యుద్ధం మరొకరిని చేయమనడం ధర్మం కాదని అన్నారు

భారీగా హాజరైన జనం

భారీగా హాజరైన జనం

కరీంనగర్‌లో శ్రీరాజరాజేశ్వర డిగ్రీ కళాశాల మైదానంలో జరిగిన టిఆర్ఎస్ ఎన్నికల శంఖారావం బహిరంగ సభలో కెసిఆర్ పాల్గొని ప్రసంగించారు. సభకు తెలంగాణ జిల్లాల నుంచి భారీగా జనం తరలివచ్చారు.

వేదికపై ప్రసంగిస్తూ..

వేదికపై ప్రసంగిస్తూ..

తెలంగాణ పునర్నిర్మాణంలో పాలు పంచుకోవడానికే తమ పార్టీ అధికారం కోరుతున్నదని కెసిఆర్ చెప్పారు. ఈ ఎన్నికల్లో అసెంబ్లీకి, లోక్‌సభకు రెండు ఓట్లు తమ పార్టీకి వేసి తమ అభ్యర్థులందరిని గెలిపించాలని అన్నారు.

కెసిఆర్ వందనాలు

కెసిఆర్ వందనాలు

తెలంగాణ ప్రజలు తమ తలరాతలు తామే రాసుకునే సమయం వచ్చిందని, అందుకే ప్రజలు అప్రమత్తంగా ఉండి ఉద్యమ పార్టీ టిఆర్ఎస్‌ను ఈ ఎన్నికల్లో గెలిపించాలని కోరారు.

గద చేత బట్టి..

గద చేత బట్టి..

తాము తమ మేనిఫెస్టోలో చేర్చిన ప్రతీ అంశాన్ని అధికారంలోకి వచ్చిన తర్వాత చిత్తశుద్ధితో అమలు చేస్తామని కెసిఆర్ చెప్పారు.

నాదే బాధ్యత

నాదే బాధ్యత

అధికారంలోకి వచ్చిన తర్వాత గోదావరి, కృష్ణా జలాలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవడానికి ప్రాజెక్టులు నిర్మిస్తామని కెసిఆర్ చెప్పారు. అధికారంలోకి వచ్చిన మూడేళ్ల కల్లా 24 గంటల పాటు కరెంట్ ఇచ్చే స్థాయికి చేరుకుంటామని, ఆ బాధ్యత తనదని కెసిఆర్ హామీ ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+