షాక్: ఉద్యోగ భద్రత లేదని తెలుగు టెక్కీ దుర్గాప్రసాద్ ఆత్మహత్య

ఐటీ ఉద్యోగానికి భద్రత లేదనే ఆవేదనతో కృష్ణాజిల్లాకు చెందిన టెక్కీ గోపికృష్ణాదుర్గాప్రసాద్ ఆత్మహత్య చేసుకొన్నాడు. ఈ ఘటన ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది.

విజయవాడ: ఐటీ ఉద్యోగానికి భద్రత లేదనే ఆవేదనతో కృష్ణాజిల్లాకు చెందిన టెక్కీ గోపికృష్ణాదుర్గాప్రసాద్ ఆత్మహత్య చేసుకొన్నాడు. ఈ ఘటన ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది.

గోపికృష్ణాదుర్గాప్రసాద్ గతంలో హైద్రాబాద్, ఢిల్లీలో పనిచేశాడు. మూడురోజుల క్రితం పూణెలోని ఓ ఐటీకంపెనీలో చేరాడు. పూణెలోని విమాననగర్‌లోని హోటల్‌లో ఆయన బస చేశాడు.

In IT there is no job security’: 25-year-old techie commits suicide in Pune

ఐటీ ఉద్యోగంలో భద్రత లేదనే ఆవేదనతో చేతి మణికట్టు వద్ద బ్రేడుతో 25చోట్ల కోసుకొన్నాడు. అనంతరం హోటల్ టెర్రస్ మీదకు వెళ్ళి భవనం నుండి కిందకు దూకి ఆత్మహత్య చేసుకొన్నాడు.

ఐటీలో ఉద్యోగ భద్రత లేదు, నేను నా కుటుంబం గురించి చలా బాధపడుతున్నాను. అంటూ సూసైడ్ నోట్ రాసి పెట్టి దుర్గాప్రసాద్ ఆత్మహత్య చేసుకొన్నాడని పూణే పోలీసులు తెలిపారు.

సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ దుర్గాప్రసాద్ ఆత్మహత్య చేసుకొన్న నేపథ్యంలో ఐటీ కంపెనీల యాజమాన్యాల ఉద్యోగ వ్యతిరేక నిర్ణయాలకు వ్యతిరేకంగా పోరాడేందుకు యూనియన్‌ను ఏర్పాటుచేయాలని నిర్ణయించుకొన్నట్టు టెక్కీలు చెప్పారు.

దుర్గాప్రసాద్‌కు ఎలాంటి చెడు అలవాట్లులేవని అతను ఎలా ఆత్మహత్యచేసుకొంటాడని మృతుడి భంధువు వెంకటమూర్తి ప్రశ్నించారు. పోస్ట్‌మార్టమ్ అనంతరం పోలీసులు మృతదేహన్ని బంధువులకు అప్పగించారు. అంత్యక్రియలకోసం మృతదేహాన్ని కృష్ణా జిల్లాకు తరలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+