గుంటూరులో మరో నిర్భయ కేసు : వివాహితపై మైనర్ అత్యాచారం, ప్రైవేట్ పార్ట్స్‌లో కర్రతో దాడి

Recommended Video

    గుంటూరులో మరో నిర్భయ కేసు : వివాహితపై మైనర్ అత్యాచారం.

    అమరావతి: మహిళలపై అత్యాచారాలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన చట్టాలను తీసుకొచ్చినా కానీ, ఈ తరహ ఘటనలు మాత్రం ఆగడం లేదు. గుంటూరు జిల్లాలో నిర్భయ తరహ ఘటన చోటు చేసుకొంది. తీవ్రంగా గాయపడిన బాధితురాలు ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఒంటరి మహిళను చూసి బాధితురాలిపై దుండగుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

    గుంటూరు జిల్లాలో దారుణం చోటు చేసుకొంది. భర్తను వదిలేసి ఒంటరిగా ఉంటున్న మహిళపై కన్నేసిన ఓ యువకుడు బాధితురాలిపై పాశవికంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఢిల్లీలో చోటు చేసుకొన్న నిర్భయ ఘటన తరహాలో బాధితురాలిని చిత్ర హింసలకు గురిచేశాడు.

    రాత్రంతా బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమెను తీవ్రంగా గాయపర్చాడు. బాధితురాలి ప్రైవేట్‌ పార్ట్స్‌లో తీవ్ర గాయాలున్నట్టుగా వైద్యులు చెబుుతున్నారు.

     గుంటూరులో నిర్భయ తరహా దారుణం

    గుంటూరులో నిర్భయ తరహా దారుణం

    గుంటూరు జిల్లా ఒప్పిచర్లలో దారుణం చోటు చేసుకొంది. పిడుగురాళ్ళ మండలం జూలకల్లుకు చెందిన బాధితురాలికి చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోయారు. అమ్మమ్మ వద్దే ఆమె పెరిగి పెద్దదైంది. అయితే ఏడేళ్ళ క్రితం కారంపూడి మండలం ఒప్పిచర్లకు చెందిన యువకుడితో వివాహం జరిగింది. కొడుకు పుట్టిన తర్వాత భర్త ఆమెను ఇంటి నుండి తరిమేశాడు. దీంతో అదే గ్రామంలో వివాహిత మరో ఇంటిని అద్దెకు తీసుకొని ఉంటుంది. అయితే రెండు రోజుల క్రితం బాధితురాలి ఇంట్లోకి దూరిన సైదులు అనే యువకుడు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపర్చాడు.

     ఆ రోజుం ఏం జరిగిందంటే

    ఆ రోజుం ఏం జరిగిందంటే

    ఏప్రిల్ 22వ తేది రాత్రి పూట కూలీ పనులు వెళ్ళి వచ్చిన బాధితురాలు స్నానం చేసి బట్టలు మార్చుకొంటుండగా ఆమె ఇంటి పక్కనే నివాసం ఉంటే షేక్ సైదులు అనే యువకుడు ఆమె ఇంట్లోకి దూరాడు. బాధితురాలి నోట్లో గుడ్డలు కుక్కి అత్యాచారానికి పాల్పడ్డాడు. చంపేస్తానని హెచ్చరించాడు. తెల్లవారుజామున ఐదుగంటల వరకు బాధితురాలిని తీవ్ర చిత్రహింసలకు గురిచేశాడు. అంతేకాదు ఆమె ప్రైవేట్ పార్ట్స్‌లో కర్రను పెట్టి మెలితిప్పాడు. దీంతో బాధితురాలు తీవ్రంగా గాయపడింది.బయట ఎవరికైనా చెబితే చంపేస్తానని హెచ్చరించాడు.

    రక్తంతో తడిసిన దుస్తులతో బయటకు వచ్చిన బాధితురాలు

    రక్తంతో తడిసిన దుస్తులతో బయటకు వచ్చిన బాధితురాలు

    సైదులు పాల్పడిన కిరాతకంతో బాధితురాలు తీవ్రంగా గాయపడింది. ఆమె ధరించిన దుస్తులన్నీ కూడ రక్తంతో తడిసిపోయాయి. సోమవారం నాడు ఉదయం పూట రక్తం తడిసిన దుస్తులతో ఆమె ఓపికను తెచ్చుకొని బయటకు వచ్చింది. ఆమె తనకు జరిగిన అన్యాయాన్ని స్థానికులకు వివరించింది. దీంతో స్థానికులు ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

    పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు

    పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు

    తనకు జరిగిన అన్యాయంపై బాధితురాలు అమ్మమ్మ సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి పిర్యాదుతో పోలీసులు ఈ కేసు విచారణ చేస్తున్నారు. బాధితురాలి ఇంట్లో ఉన్న రక్తం మరకలను, బాధితురాలి ప్రైవేట్ పార్ట్స్‌లో దాడికి ఉపయోగించిన కర్రను , రక్తంతో తడిసిన దుస్తులను పోలీసులు సేకరించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+