ఏపీకి బిగ్ ట్విస్ట్ ఇచ్చిన కేంద్రం..ఆశలపై నీళ్లు
2024-25 ఆర్థిక సంవత్సరంలో మిగిలిన 8 నెలల కాలానికి వార్షిక బడ్జెట్‌ను మంగళవారం పార్లమెంట్‌లో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి దోహదపడే విధంగా బడ్జెట్ రూపొందించామని నిర్మలా సీతారామన్ తెలిపారు. వికసిత్ భారత్ లక్ష్యంగా 3.0 బడ్జెట్‌ను తయారు చేశామని.. దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతోందని, ద్రవ్యోల్బణం తగ్గుతోందని ఆమె తెలిపారు. బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్, బీహార్, జార్ఖండ్ రాష్ట్రాలకు అధిక స్థాయిలో కేటాయింపులు దక్కాయి.
ముఖ్యంగా ఏపీ రాజధాని అభివృద్దికి ప్రత్యేకంగా రూ. 15,000 కోట్లు కేటాయిస్తున్నట్టు పార్లమెంట్‌లో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దీంతో ఎన్డీఏలో భాగస్వామి అయిన టీడీపీ, జనసేన నేతలు హర్షం వ్యక్తం చేశారు. బడ్జెట్ క్రెడిట్ కోసం ఇరు పార్టీల నేతలు పోటీ పడ్డారు. తమ వల్లే ఈ కేటాయింపులని టీడీపీ నేతలు అంటుంటే, పవన్ వల్లే ఇంతటి స్థాయిలో నిధులు వచ్చాయంటూ జనసేన నేతలు చంకలు గుద్దుకున్నారు. తీరా ఇది సాయం కాదు అప్పుగా మాత్రమే ఇస్తున్నామని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది.

అయితే అసలు విషయం తర్వాత కానీ తెలియలేదు. బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం మీడియాతో మాట్లాడిన కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ , ఏపీకి కేటాయించిన బడ్జెట్‌పై క్లారిటీ ఇచ్చారు. ఏపీలో అమరావతి రాజధాని నిర్మాణానికి కేంద్రం సాయం అనేది చట్టంలో ఉందని కేంద్ర మంత్రి అంటూనే దాని ప్రకారం రూ.15 వేల కోట్లు వరల్డ్ బ్యాంక్ నుంచి తెప్పిస్తున్నామని చెప్పారు. అంటే ప్రపంచ బ్యాంక్ ద్వారా ఆర్ధిక సాయం అందేలా చూస్తామని చెప్పారు. ప్రపంచ బ్యాంక్ అంటే రుణాలు ఇచ్చేదే తప్ప ఉచితంగా ఇవ్వదు.
మరి ఆ విధంగా ఆలోచిస్తే ఏపీకి ఇచ్చే రూ. 15000 వేల కోట్ల రూపాయల రుణమే తప్ప ఆర్ధిక సాయం ఏ మాత్రం కాదని అర్ధం అవుతోంది. రాష్ట్ర ప్రభుత్వానికి , వరల్డ్ బ్యాంక్‌కు మధ్య కేంద్ర ప్రభుత్వం మధ్యవర్తిగా వ్యవహరిస్తోంది, అంతే తప్పిస్తే ఈ రూ. 15000 వేల కోట్లకు కేంద్రానికి ఎటువంటి సంబంధం లేదన్న మాట. ప్రపంచ బ్యాంకు ఎవరికీ ఉచితంగా రుణం ఇవ్వదు , కాబట్టి ఈ రూ.15000 వేల కోట్లు తిరిగి రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాల్సి ఉంటోంది. దీనిపై సీఎం చంద్రబాబు సైతం స్పందించారు. నిధులు అప్పుల రూపంలోనే అయినా వాటిని తీర్చేది 30 ఏళ్ల తర్వాతే అని కూడా చంద్రబాబు చెప్పడం విశేషం.అప్పు అయినా ముప్పయ్యేళ్ల తర్వాత తీరుస్తామని చంద్రబాబు అనడం బట్టి కేంద్రం ఈ విషయంలో ఏపీకి ప్రత్యేకంగా చేసిన సాయం ఏమిటి అన్న చర్చ సాగుతోంది.












Click it and Unblock the Notifications