అక్రమ అరెస్ట్ అంటే చంద్రబాబును చేసింది, మిథున్ రెడ్డిని చేసింది కాదు: హోం మంత్రి అనిత!

ఏపీ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టు రిమాండ్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆధారాలు ఉంటేనే ఎవరినైనా అరెస్టు చేస్తారని, సరైన ఆధారాలను కోర్టులో ప్రొడ్యూస్ చేస్తేనే కోర్టు రిమాండ్ కోర్టు రిమాండ్ విధించింది అంటే మనం కోర్టు నిర్ణయాన్ని గౌరవించాలని వంగలపూడి అనిత పేర్కొన్నారు. న్యాయస్థానానికి సరైన ఆధారాలు ఇవ్వకపోతే రిమాండ్ విధించరు కదా అంటూ ప్రశ్నించారు.

అక్రమ అరెస్ట్ నాడు చంద్రబాబును చేసింది : హోం మంత్రి అనిత
ప్రొసీజర్ యధావిధిగా కొనసాగుతుందని చెప్పిన ఆమె మిథున్ రెడ్డి అరెస్ట్ గురించి మాట్లాడుతూ అనేక కీలక విషయాలను వెల్లడించారు. నేడు సత్యసాయి జిల్లా మడకశిరలో మీడియా సమావేశంలో మాట్లాడిన వంగలపూడి అనిత అక్రమ అరెస్ట్ అనే ఫీలింగ్ వారికి ఉంటే కోర్టులో తేల్చుకోవాలన్నారు. అక్రమ అరెస్ట్ అంటే నాడు చంద్రబాబును చేసిందని, మిధున్ రెడ్డిని చేసింది కాదని వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు.

in ysrcp regime chandrababu illegally arrested home minister vangalapudi anitha comments on mithun reddy arrest

పెద్దిరెడ్డిపై ఆ కేసుల విచారణ ముగియలేదు
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కి సంబంధించిన ఫైళ్ల దహనం కేసు, అటవీ భూములలో అక్రమ నిర్మాణాల పైన కేసులలో ఇంకా విచారణ కొనసాగుతూనే ఉందని, ఆ కేసులలో దర్యాప్తు ముగియ లేదని వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు. గండికోట లో బాలిక హత్య కేసుకు సంబంధించి ఒకటి రెండు రోజుల్లో నిందితుడి పైన క్లారిటీ వస్తుందని, అప్పటివరకు ఆగాలని ఆమె విజ్ఞప్తి చేశారు. దర్యాప్తు కొనసాగుతుందని పేర్కొన్నారు.

నాడు నేడు కార్యక్రమంపై విచారణ చేస్తే అన్నీ బయటకు వస్తాయ్
ఒక్క ఛాన్స్ అన్న పాపానికి 20 సంవత్సరాలు రాష్ట్రం వెనక్కు వెళ్లిందని గత వైసిపి ప్రభుత్వ పాలనను వంగలపూడి అనిత టార్గెట్ చేశారు. గత ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాట్లాడిన ఆమె నాడు నేడు కార్యక్రమం అంతా పైన పటారం లోన లొటారం లా ఉందని వ్యాఖ్యానించారు. ఆ కార్యక్రమం పైన విచారణ చేస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయని వంగలపూడి అనిత పేర్కొన్నారు.

భార్యలు, భర్తలను హతమారుస్తున్న ఘటనలపై అనిత
ఇక ఇటీవల కాలంలో భార్యలు భర్తలను హత్య చేస్తున్న సంఘటనల పైన మాట్లాడిన వంగలపూడి అనిత దీనికి మానసికంగా వస్తున్న మార్పు కారణమని, సినిమాలు, సోషల్ మీడియా, డిజిటల్ మీడియా ప్రభావం కూడా చాలా ఉందని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు సైబర్ క్రైమ్ స్టేషన్లు పనిచేస్తున్నాయని పేర్కొన్న ఆమె జిల్లాకు ఒక సైబర్ క్రైమ్ పిఎస్ ఏర్పాటుకు సీఎం చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారని పేర్కొన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా లక్ష సీసీ కెమెరాలు ఏర్పాటు
ప్రతి పోలీస్ స్టేషన్ కు రెండు డ్రోన్లు ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అందుకు లక్ష సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. మడకశిరలో డిఫెన్స్ పరిశ్రమ త్వరలో రాబోతుందని వంగలపూడి అనిత వెల్లడించారు. గత ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ అని చెప్పి సాక్షి క్యాలెండర్ విడుదల చేసిందని ఎద్దేవా చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+