టి, ఏపి శాసనభల ఆవరణలో ఎగిరిన జెండా(పిక్చర్స్)
హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రభుత్వ, పార్టీ కార్యాలయాల్లో అధికారులు నాయకులు జాతీయ జెండాను ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ శాసనసభల ప్రాంగణంలో ఇరు రాష్ట్రాల స్పీకర్లు జాతీయ జెండాను ఆవిష్కరించారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల శాసనసభ స్పీకర్లు మధుసూదనాచారి, కోడెల శివప్రసాద రావు వేర్వేరుగా జాతీయ పతాకాలను ఆవిష్కరించారు. అంతకుముందు సభా ప్రాంగణంలో ఉన్న అంబేద్కర్, మహాత్మా గాంధీ విగ్రహాల వద్ద నివాళులర్పించారు. తెలంగాణ శాసనమండలి ఆవరణలో ఛైర్మన్ స్వామిగౌడ్ జాతీయ జెండాను ఎగురవేశారు.

ఎగిరిన జెండా
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా జరిగాయి.

ఎగిరిన జెండా
తెలంగాణ శాసనమండలి ఆవరణలో జాతీయ పతాకాన్ని ఎగురవేస్తున్న ఛైర్మన్ స్వామిగౌడ్, హాజరైన ఎమ్మెల్సీలు.

మహ్మాత్మునికి నివాళి
శాసనసభ ఆవరణలోని మహాత్ముని విగ్రహం వద్ద నివాళులర్పిస్తున్న తెలంగాణ శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి.

మహాత్మునికి నివాళి
శాసనసభ ఆవరణలోని మహాత్ముని విగ్రహం వద్ద వద్ద నివాళులర్పిస్తున్న తెలంగాణ శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్, శాసనమండలి ఛైర్మన్ స్వామిగౌడ్.

గీతాలాపన
శాసనమండలి ఆవరణలో జాతీయ జెండా ఎగురవేసిన అనంతరం జాతీయ గీతాన్ని ఆలపిస్తున్న ఎమ్మెల్సీలు.

జెండా ఎగిరేసిన టిజివోలు
జాతీయ జెండాను ఎగిరేసిన అనంతరం జాతీయ గీతాలాపన చేస్తున్న తెలంగాణ ఉద్యోగులు.












Click it and Unblock the Notifications