ఈ-కేబినెట్: దేశంలోనే బాబు రికార్డ్, పాలనపై ఆరా

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం సుమారు నాలుగు గంటలకు పైగా కొనసాగింది. వందరోజుల పాలన, మంత్రుల పనీ తీరు, రుణమాఫీ, నిధుల సమీకరణ పైన కేబినెట్లో చర్చించారు. కాగా, దేశంలోనే తొలి ఈ-కేబినెట్ సమావేశంగా ఈ భేటీ చరిత్ర సృష్టించింది.

ఐపాడ్‌లు, పవర్ పాయింట్ ప్రజంటేషన్ సాయంతో దేశంలోనే తొలిసారిగా నిర్వహించిన కాగిత రహిత మంత్రివర్గ సమావేశం నాలుగు గంటల పాటి సాగింది. ఈ కేబినెట్ సమావేశం ద్వారా ఏపీ సర్కార్ అందరినీ ఆశ్చర్యపరిచింది. కాగా, చంద్రబాబు వంద రోజుల పాలన పైన నివేదికను మంత్రుల నుండి అడిగి తీసుకున్నారు. ఎవరి పని తీరు వారే సమీక్షించుకొని నివేదిక ఇవ్వాలని చంద్రబాబు ఆదేశించారు.

సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు...

India's first ever e-Cabinet in Andhra Pradesh

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీ సిటీ ఎస్ఈజెడ్‌లో హోండా పరిశ్రమ ఏర్పాటుకు 600 ఎకరాలు కేటాయించాలని మంత్రివర్గం నిర్ణయించింది.
ప్రభుత్వం పథకాల అమలు తీరు పర్యవేక్షణకు గ్రామ, మండల, మున్సిపల్, జిల్లా స్థాయిల్లో ప్రత్యేక కమిటీల ఏర్పాటు.
అక్టోబర్ 2 నుండి నిరంతర విద్యుత్ అమలు ప్రారంభానికి నిర్ణయం. అక్టోబర్ 2న ఎన్టీఆర్ సుజల, వృద్ధాప్య పించన్ల పెంపు ప్రారంభించాలని నిర్ణయం
బీఈడీ అభ్యర్థులకు ఎస్జీటీలుగా అవకాశం కల్పనపై చర్చ
అడ్డంకులను త్వరగా తొలగించుకోవాలని విద్యాశాఖ మంత్రికి చంద్రబాబు సూచన
అవాంతరాలు తొలగిన వెంటనే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలకు నిర్ణయం
రుణమాఫీ అమలులో నిధుల సమీకరణకున్న అడ్డంకులు, ఎలా సమీకరించాలి. అక్టోబరు మొదటి వారం నుండి రుణమాఫీ అమలుకు నిర్ణయం.
అక్టోబర్ 2లోగా ఎన్టీఆర్ క్యాంటీన్ల ఏర్పాటు అంశంపై చర్చ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+