ఏపీ దేశంలోనే రెండో స్థానం: పాజిటివిటీ రేటు పెరగడంపై కేంద్రమంత్రి ఆందోళన, ఆ జిల్లాల్లోనూ
న్యూఢిల్లీ: ఆంధప్రదేశ్ తోపాటు మరికొన్ని రాష్ట్రాల్లో కరోనా పాజిటివిటీ రేటు పెరగడంపై కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. ఏపిల్ తొలినాళ్ల నుంచి ఏపీలో పాజిటివిటీ రేటు పెరిగుతోందని కేంద్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. ఏపీతోపాటు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో కరోనా పరిస్థితులపై కేంద్రమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.

ఏపీలో వారం పాజిటివిటీ వృద్ధిరేటు 30 శాతం..
ఏపీలో వారం వృద్ధిరేటు 30 శాతం వరకు ఉందని, చిత్తూరు, తూర్పుగోదావరి, గుంటూరు, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో పరిస్థితులు ఆందోళనకరంగానే ఉన్నాయన్నారు కేంద్రమంత్రి హర్షవర్ధన్. ఈ సందర్భంగా జాతీయ అంటువ్యాధుల నియంత్రణ కేంద్రం డైరెక్టర్ సుజీత్ కే సింగ్.. వ్యాధి సంక్రమణ తీరుపై ప్రజంటేషన్ ఇచ్చారు.
సమీప గ్రామాల నుంచి రోగులు పట్టణాలకు వచ్చే అవకాశం ఉన్నందున ఆస్పత్రుల్లో సౌకర్యాలు పెంచాలన్నారు. కరోనా రకాల్లో వస్తున్న మార్పులపై దృష్టి సారించాలని నిర్దేశించారు. ఇప్పటి వరకు 18 కోట్ల డోసులు ప్రజలకు అందించామని, జులై చివరి నాటికి మరో 33.6 కోట్ల డోసులు ఉత్పత్తి అవుతాయని చెప్పారు.

పాజిటివిటీ రేటు పెరుగుదలలో ఏపీ రెండోస్థానం
ప్రస్తుతం దేశంలో గత కొద్ది వారాలుగా నిరంతరం కరోనా కేసుల పెరుగుదల కనిపిస్తున్న 8 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉందని కేంద్ర వైద్యఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. తమిళనాడు తర్వాత ఏపీ ఉందని, ఆ తర్వాత స్థానాల్లో పశ్చిమబెంగాల్, ఒడిశా, పంజాబ్, అస్సాం, హిమాచల్‌ప్రదేశ్, పుదుచ్చేరి ఉన్నట్లు తెలిపారు.

ఏపీలో జిల్లాల్లో పాజిటివిటీ రేటు అధికం
గత రెండు వారాలుగా నిరంతరం కేసులు పెరుగుతున్న జిల్లాలు 15 ఉండగా, అందులో ఆరో స్థానంలో తూర్పుగోదావరి, పదో స్థానంలో విశాఖపట్నం, 12 స్థానంలో కడప జిల్లాలు ఉన్నాయి. మే 18-14 తేదీల మధ్య 25.3 శాతం పాజిటివిటీ రేటుతో ఏపీ.. అత్యధిక పాజిటివిటీ రేటు ఉన్న రాష్ట్రాల జాబితాలో 10వ స్థానంలో నిలిచింది.
42.3శాతంతో పుదుచ్చేరి, 42శాతంతో గోవా, 33.4 శాతంతో పశ్చిమబెంగాల్ తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. యాక్టివ్ కేసుల్లో దేశంలో ఏపీ 5వ స్థానం(2,03,787)లో ఉంది. దేశంలోని 516 జిల్లాల్లో 10శాతానికి మించి పాజిటివిటీ రేటు ఉండగా, అందులో ఏపీలోని 13 జిల్లాలు ఉండటం గమనార్హం. 42 జిల్లాలతో మధ్యప్రదేశ్, 37 జిల్లాలతో తమిళనాడు, 35 జిల్లాలతో మహారాష్ట్ర తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ తోపాటు మరో 17 రాష్ట్రాల్లో కేసులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయని తెలిపారు.
Recommended Video

జులై నాటికి 51.6 కోట్ల వ్యాక్సిన్ డోసులు.. డిసెంబర్ నాటికి 216 కోట్లు
స్పుత్నిక్ వ్యాక్సిన్‌కు ఇప్పటికే అనుమతులు ఇచ్చామని, కొత్తగా జైడస్ క్యాడిలా, సీరం ఇనిస్టిట్యూట్ నోవా వాక్స్, భారత్ బాయోటెక్ నాసల్ వ్యాక్సిన్, జెనోవా ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్లు కలిపి ఆగస్టు-డిసెంబర్ మధ్య కాలంలో 216 కోట్ల డోసులు ఉత్పత్తి అవుతాయని కేంద్రమంత్రి తెలిపారు. జులై నాటికి 51.6 కోట్ల వ్యాక్సిన్ డోసులు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. కరోనాపై ఇప్పుడిప్పుడే వ్యాక్సిన్ ప్రభావం కనిపిస్తోందని, ప్రాణ నష్టం జరగకుండా కాపాడటానికి వీలవుతోందని సమావేశంలో పాల్గొన్న రాష్ట్రాల వైద్యారోగ్యశాఖ మంత్రలు వెల్లడించారు.
-
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications