India Today Axis My India Exit Poll: వైసీపీకి బిగ్ షాక్: ఫైనల్ రిపోర్ట్‌లో ఫ్యాన్ బేజార్..!!
దేశవ్యాప్తంగా చివరి విడత లోక్‌సభ ఎన్నికలు ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ వెలువడటం ఆరంభమైంది. సాయంత్రం 6:30 గంటలకు ఎగ్జిట్ పోల్స్ సందడి మొదలైంది. ఏపీలో జరిగిన 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ, తెలంగాణలో 17 లోక్‌సభ నియోజకవర్గాలపై ఎగ్జిట్ పోల్స్ అంచనాలు విడుదల అవుతున్నాయి.
జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు సందర్భంగా వెలువడే ఫలితాలకు ఇంచుమించుగా సరిపోయేలా ఇవి ఉండొచ్చనే అంచనాలు వ్యక్తమౌతోన్నాయి. తాజాగా ఏపీపై తన ఎగ్జిట్ పోల్ అంచనాలను కొద్దిసేపటి కిందటే విడుదల చేసింది ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా సంస్థ. ఎవరు అధికారంలోకి వస్తారనేది తేల్చి చెప్పింది.

ఇప్పటివరకు విడుదలైన మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ ఒక ఎత్తయితే.. అత్యంత విశ్వసనీయత ఉన్నట్లుగా చెప్పుకొనే ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా మాత్రం పూర్తి విరుద్ధమైన అంచనాలను వెల్లడించడం మరో ఎత్తు. లోక్‌సభ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ దారుణంగా ఓడిపోబోతోందని అంచనా వేసింది.
2019 నాటి ఎన్నికల్లో లోక్‌సభలో వైఎస్ఆర్సీపీ చూపిన దూకుడు మటుమాయం అయినట్టేనని పేర్కొంది. రాష్ట్రంలో మొత్తం 25 లోక్‌సభ నియోజకవర్గాలు ఉండగా.. వైఎస్ఆర్సీపీకి 2 నుంచి 4 స్థానాలు మాత్రమే దక్కుతాయని ఈ సంస్థ అభిప్రాయపడింది. 21 నుంచి 23 సీట్లను కోల్పోతుందని తెలిపింది.
ఏపీలో వరుసగా రెండోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని తెలిపింది. తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ మరోసారి ప్రతిపక్ష పాత్రకే పరిమితమౌతుందని పేర్కొంది. అసెంబ్లీ నియోజకవర్గాలపై నిర్వహించిన సర్వే అంచనాలను ఇండియా టుడే ఇంకా విడుదల చేయాల్సి ఉంది.
లోక్‌సభలో తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ కూటమికి 21 నుంచి 23 నియోజకవర్గాలు దక్కుతాయని ఇండియా టుడే అభిప్రాయపడింది. ఈ కూటమికి పడే ఓట్ల శాతం సుమారుగా 49 శాతం వరకు ఉండొచ్చు. ఏపీ లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి ఒక్కటీ దక్కబోదు. బోణీ కొట్టడం కూడా అసాధ్యమేనని తేల్చి చెప్పింది.












Click it and Unblock the Notifications