విశాఖలో శ్రీలంకXభారత్ ట్వంటీ 20: 'మీ సేవ'లో 6 విభాగాల్లో టిక్కెట్లు
విశాఖ: భారత్ - శ్రీలంకల మధ్య మూడో వన్డేకు విశాఖ వేదిక కానుంది. మూడో వన్డే కోసం 18 మీ సేవా కేంద్రాల ద్వారా రేపటి నుంచి టిక్కెట్లు ఇవ్వనున్నారు. మొత్తం 6 కేటగిరీల్లో మొత్తం పన్నెండు వేల టిక్కెట్లను విక్రయించనున్నారు.
ఈ నెల 14వ తేదీన విశాఖలో భారత్ - శ్రీలంక క్రికెట్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. టిక్కెట్లను మీ సేవా కేంద్రాలలో పొందవచ్చు. రూ.300, రూ.600, రూ.1000, రూ.1500, రూ.2వేలు, రూ.3వేలు ధరలు ఉన్నాయి. తొలి ట్వంటీ 20 పుణేలో జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత్ 5 వికెట్ల తేడాతో ఓడిపోయింది.

ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్, విశాఖపట్నం జిల్లా క్రికెట్ అసోసియేషన్ రెండూ కలిసి ఆఖరి మ్యాచ్ కోసం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. మ్యాచ్ ఏర్పాట్లను చూసేందుకు సబ్ కమిటీని ఏర్పాటు చేశారు.












Click it and Unblock the Notifications