ఈ రైలులో ప్రయాణించాలంటే అంబానీ, అదానీ కూడా టికెట్లు కొనలేరు?
భారతీయ రైల్వే నెట్ వర్క్ పరంగా ప్రపంచంలో నాలుగో స్థానంలో నిలవడమే కాకుండా ప్రతిరోజు రెండు కోట్ల మంది ప్రయాణికులను తన గమ్యస్థానాలకు చేరవేస్తుంటుంది. తక్కువ ఛార్జీలతో ఎక్కువ దూరాన్ని భద్రంగా చేర్చగలిగే రవాణా సాధనంగా రైలుకు పేరుతుంది. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రయాణికులకు అత్యాధునిక సౌకర్యాలను అందుబాటులోకి తెస్తున్నాయి. వందేభారత్, రాజధాని, శతాబ్ది రైళ్లల్లో ఛార్జీలు ఎక్కువగా ఉంటాయి. వాటి ఛార్జీల ప్రకారం ఆ రైళ్లల్లో వేర్వేరు కోచ్ లను ఏర్పాటు చేస్తారు.
అత్యంత లగ్జరీ రైలు
మనదగ్గర ప్రయాణించే అన్ని రైళ్లకన్నా ఓ ప్రత్యేకమైన రైలును భారతదేశం సొంతం చేసుకుంది. దానిపేరు మహారాజా ఎక్స్ ప్రెస్. ఇందులోని సౌకర్యాలు చూస్తే మూర్ఛపోయినంతపనవుతుంది. అత్యంత విలావవంతంగా ఉండి, ఖరీదైన సేవలను అందిస్తుంది.దీంట్లో ప్రయాణించాలంటే లక్షల రూపాయల్లో చెల్లించాల్సి ఉంది. ఈ రైలును నడుస్తున్న ఫైవ్ స్టార్ హోటల్ గా అభివర్ణిస్తారు.

ఇందులో ప్రయాణించే ప్రయాణికులు ప్రపంచ స్థాయిలోని రాజ్ షాహి సేవలను ఈ రైలులో ప్రయాణించడంద్వారా పొందుతారు. ఒక్క మనదేశంలోనే కాకుండా ఆసియాలోనే అత్యంత ఖరీదైన లగ్జరీ రైలుగా పేరు తెచ్చుకుంది. 2010లో భారతీయ రైల్వే దీన్ని ప్రారంభించి ఇప్పటికీ నడుపుతోంది.

పర్యాటకుల కోసం ఐఆర్ సీటీసీ
ప్రస్తుతం పర్యాటలకుల కోసం ఐఆర్ సీటీసీ ఆధ్వర్యంలో ప్యాకేజ్ రైళ్లు నడుస్తున్నాయి. దేశంలోని వివిధ పుణ్యక్షేత్రాలకు, విహార యాత్రలకు తీసుకువెళ్లి మళ్లీ తీసుకు రావడంలో భాగంగా ఈ ప్యాకేజ్ ఉంటుంది. దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలకు హైదరాబాద్, సికింద్రాబాద్, వరంగల్, ఖాజీపేట, విజయవాడ నుంచి నడుపుతున్నారు. భోజనం ఐఆర్ సీటీసీ ఏర్పాటు చేస్తుంది. అల్పాహారం మాత్రం ప్రయాణికులే చూసుకోవాలి. అతి తక్కువ సమయంలో ఎక్కువ క్షేత్రాలను సందర్శించాలనుకునేవారికి ఇటువంటి ప్యాకేజీలు మంచి మార్గం












Click it and Unblock the Notifications