రైలు ప్రయాణికులకు అలర్ట్... రైళ్ల రద్దు
దేశవ్యాప్తంగా అన్ని రైల్వే జోన్లు, డివిజన్ల పరిధిలో ట్రాక్ మరమ్మతు పనులతోపాటు సిగ్నలింగ్ వ్యవస్థను ఆధునికీకరించే పనులు జరుగుతున్నాయి. గతేడాది ఒడిసాలోని బాలసోర్ వద్ద కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. దీంతో ఈ తరహా దుర్ఘటనలు మళ్లీ జరగకుండా చూసేందుకు సిగ్నలింగ్ వ్యవస్థను భారతీయ రైల్వే ఆధునికీకరిస్తోంది. దీనిలో భాగంగానే పనులు జరుగుతుండటంతో కష్టమైనప్పటికీ రైళ్లను పెద్దసంఖ్యలో రద్దుచేస్తున్నారు. దీనిపై విమర్శలు వచ్చినప్పటికీ రైల్వే అధికారులు మాత్రం వెనకడుగు వేయడంలేదు. పనులకే మొదటి ప్రాధాన్యతనిస్తున్నారు.
దారి మళ్లించి నడుపుతున్న రైళ్లు
ప్రస్తుతం ముఖ్యమైన నాగపూర్ డివిజన్ లో ఇంటర్ లాకింగ్ పనులు జరుగుతుండటంతో ఏపీ మీదుగా ప్రయాణించే రైళ్లను రద్దు చేశారు. మరికొన్నింటిని విజయవాడ, బలార్షా, నాగపూర్ మీదుగా దారి మళ్లించి నడుపుతున్నారు. ఆగస్టు 6, 10, 11, 12, 13, 14, 15, 18 తేదీల్లో విశాఖపట్నం-హజ్రత్ నిజాముద్ధీన్ (12807/12808 ) రైలు, ఆగస్టు 12, 14 తేదీల్లో ఎర్నాకుళం-బిలాస్‌పూర్ (22815/22816) రైలు, ఆగస్టు 18,20 తేదీల్లో ఎల్‌టీటీ ముంబై-విశాఖపట్నం (22847/22848) రైలును దారి మళ్లించారు. ఆయా సైట్లలో వాటి వివరాలను నమోదు చేశామని, ప్రయాణికులు సరిచూసుకోవాలని కోరుతున్నారు. ఆగస్టు 7, 8, 14, 15 తేదీల్లో సికింద్రాబాద్-రాయ్‌పూర్ (12771/12772), ఆగస్టు 12,14 తేదీల్లో నాందేడ్-సంత్రాగచి (12767/12768) రైళ్లను పూర్తిగా రద్దు చేశారు.

ప్రధానమైన రైళ్లు రద్దు
విజయవాడ డివిజన్ పరిధిలో కూడా ఇంటర్ లాకింగ్ పనులు జరుగుతుండటంతో ప్రధానమైన రైళ్లను అధికారులు రద్దుచేశారు. దీనిపై తీవ్రస్థాయిలో విమర్శలు రావడంతో లింగంపల్లి-విశాఖపట్నం జన్మభూమిని మాత్రం పునరుద్ధరించారు. ప్రస్తుతం కాకినాడ, విశాఖపట్నం, నర్సాపూర్ నుంచి నాగర్ సోల్, షిరిడీ వరకు నడిచే రైళ్లను దారి మళ్లించారా? లేదంటే రద్దు చేశారా? అనే విషయంలో మాత్రం అధికారులు స్పష్టతనివ్వడంలేదు. సికింద్రాబాద్, కాచిగూడ నుంచి నడుస్తున్న రైళ్లను కూడా రద్దు చేశారు.












Click it and Unblock the Notifications