వందే భారత్ పై ఇండియన్ రైల్వే కీలక నిర్ణయం
మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు, మంచి ప్రయాణ అనుభూతిని పంచేందుకు భారతీయ రైల్వే సెమీ హైస్పీడ్ రైళ్లయిన వందేభారత్ ను ప్రవేశపెట్టింది. తాజాగా ప్రధానమంత్రి మోడీ ఒకేసారి 9 వందే భారత్ రైళ్లను ప్రారంభించారు. కొత్త రైళ్లల్లో ఫీచర్లు కూడా చాలా బాగున్నాయని ప్రయాణికులు చెబుతున్నారు.
ప్యాకేజ్ ఫుడ్ నిషేధం:తాజాగా వందే భారత్ రైళ్లలో స్నాక్స్ అమ్మకాలను, ప్యాకేజీ ఫుడ్‌ను నిషేధించారు. ప్రయాణికుల నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకే భారతీయ రైల్వే ఈ నిర్ణయం తీసుకుంది. భోజనానికి లేదంటే టిఫిన్ కు ఆర్డర్ చేసిన ప్రయాణికులకు మెనూలో లేని ఐటమ్స్ ను సైతం విక్రయిస్తున్నారు. వీటికి సంబంధించిన కవర్లను ప్రయాణికులు ఎక్కడ పడితే అక్కడే పడేస్తున్నారు. దీనివల్ల రైలు మొత్తం అపరిశుభ్రంగా మారుతోంది.

ఓపెనవుతున్న డోర్లు:వందే భారత్ రైళ్లలో PAD (బేకరీ ఉత్పత్తులు, స్వీట్స్, కూల్ డ్రింక్స్), లా కార్టే ఐటెమ్స్ అమ్మకాలను 6 నెలలు నిషేధించారు. స్నాక్స్ కవర్లు కోచ్ లో చెల్లాచెదురుగా పడుతుండటంతో డోర్లు ఆటోమాటిక్ గా ఓపెన్ అవుతున్నాయి. కవర్లలో తినగా వదిలేసిన పదార్థాలతో దుర్వాసన వస్తోంది. ఇక నుంచి రైల్ నీరు మంచినీళ్ల సీసాలను అవసరం మేరకే సరఫరా చేయాలని నిర్ణయించారు. స్నాక్స్ ఐటెమ్స్ కవర్లు కోచ్‌ల్లో చెల్లాచెదురుగా పడి ఉండటంతో కొన్ని సందర్భాల్లో ఆటోమెటిక్ డోర్స్ ఓపెన్ అవుతున్నాయి.
క్యాటరింగ్ పై మెజేస్:ప్రయాణానికి 24 గంటల నుంచి 48 గంటల ముందు వరకు రీకన్ఫర్మేషన్ కోసం క్యాటరింగ్ సేవల వివరాలకు సంబంధించి ప్రయాణికులకు వివరాలు మెజేస్ రూపంలో వస్తాయి. ప్రీపెయిడ్ భోజనాన్ని ఎంచుకునేవారు రైలులో ఆర్డర్ చేస్తే అదనంగా రూ.50 చెల్లించాల్సి ఉంటుంది. వందే భారత్ రైళ్లలో ప్యాంట్రీ సేవల వివరాలను ప్రతి బోర్డింగ్ స్టేషన్‌లో ప్రయాణికులకు తెలిసేలా ఏర్పాట్లు చేయాలని అన్ని రైల్వే జోన్లకు రైల్వే బోర్డు ఆదేశాలు జారీ చేసింది












Click it and Unblock the Notifications