ప్రయాణికులకు ముఖ్యమైన గమనిక
మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రయాణికులకు అధునాతన సౌకర్యాలను కల్పించడంలో భారతీయ రైల్వే ముందుంది. తాజాగా వందే భారత్ రైళ్లను దేశవ్యాప్తంగా 25 మార్గాల్లో ప్రవేశపెట్టింది. మరికొద్దిరోజుల్లోనే మరో నాలుగు మార్గాల్లో అందుబాటులోకి రానుంది. కాలనుగుణంగా మారుతూ వస్తున్న భారతీయ రైల్వేకు సంబంధించిన కొన్ని ముఖ్య విషయాలు తెలుసుకుందాం.
* ప్రపంచంలోనే అత్యంత రద్దీ కలిగిన రైల్వే వ్యవస్థ భారతీయ రైల్వే.
* ఏడాదికి 8.086 బిలియన్ల మంది ప్రయాణం.
* ఏడాదికి 1208 బిలియన్ టన్నుల సరకు రవాణా.
* పొడవైన రైల్వే వ్యవస్థ గా మూడోస్థానంలో ఇండియా. మొదటి రెండు స్థానాలు అమెరికా, చైనా.
* దేశవ్యాప్తంగా విస్తరించిన రైల్వే లైన్లు 1,27,760 కిలోమీటర్ల మేర.

* భారత్ లో వేగంగా నడిచే రైలు వందే భారత్. గంటకు 180 కిలోమీటర్ల వేగం. ట్రాక్ సామర్థ్యాన్ని దృష్టిలో పెట్టుకొని గంటకు 160 కిలోమీటర్ల వేగంతోనే నడుపుతున్నారు.
* భారత్ లో అతి నెమ్మదిగా నడిచే రైలు మెట్టుపాలెం-ఊటీ మధ్య నడిచే నీలగిరి పాసింజర్. గంటకు 10 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది.
* ఎక్కువ దూరం ప్రయాణించే రైలు వివేక్ ఎక్స్ ప్రెస్. దిబ్రూగఢ్ నుంచి కన్యాకుమారి వరకు 4286 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. ప్రయాణ సమయం 82 గంటల 30 నిముషాలు.
* దేశంలోనే అత్యంత పొడవైన ప్లాట్ ఫాం కర్ణాటకలోని హుబ్లీలో ఉంది.
* 1507 మీటర్ల పొడవుతో ప్రపంచంలోనే అతి పొడవైన్ ప్లాట్ ఫాంగా చరిత్ర సృష్టించింది.
* మొదటి విద్యుత్తు రైలు 1925 ఫిబ్రవరి 3న ప్రవేశం
* మొదటి బుల్లెట్ రైలు 2027లో. ప్రయోగాత్మక పరీక్షలు 2026లో.
* ముంబయి-అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ రైల్ ట్రాక్ నిర్మాణం.
* భారత్ లో మొదటి రైల్వే మార్గాలకు పథకాలు రూపొందించినవారు.. జెమ్ సెట్జీ జీజీభోయ్, జగ్ నాథ్ సుంకర్ సేత్












Click it and Unblock the Notifications