ఇండియన్ రైల్వే సూపర్ శుభవార్త

భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. రైలు ప్రమాదాల్లో ప్రాణాలు పోయినా, గాయపడినా ఇప్పటివరకు ఇస్తున్న పరిహారాన్ని పదిరెట్లు పెంచింది. వెంటనే ఇవి అమల్లోకి వచ్చాయి. వీటిని చివరిసారిగా 2013లో పెంచారు. సెక్యూరిటీ ఉన్న లెవల్ క్రాసింగ్ గేట్ల జరిగే ప్రమాదాలకు కూడా నష్టపరిహారాన్ని వర్తింపచేస్తారు. రైళ్లల్లో, సెక్యూరిటీ ఉన్న లెవల్ క్రాసింగ్ గేట్ల వద్ద జరిగే ప్రమాదాల్లో మరణించినవారికి రూ.50,000 ఇస్తున్నారు. ఇది రూ.5 లక్షలకు పెరిగింది.

తీవ్రంగా గాయపడినవారికి రూ.25వేలకు బదులుగా రూ.2.5 లక్షలు, స్వల్ప గాయాలైనవారికి రూ.5వేలకు బదులుగా రూ.50వేలు ఇవ్వనున్నారు. అవాంచిత ఘటనల విషయంలో ఈ పరిహారాలు వరుసగా రూ.1.50 లక్షలు, రూ.50వేలు, రూ.5వేలుగా ఉంటాయి. వీటికిందకు ఉగ్రదాడులు, రైల్లో దోపిడీలు, హింసాత్మక ఘటనలు వస్తాయి. రైలు ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడినవారు 30 రోజులకు మించి ఆసుపత్రిలో ఉంటే వారికి రోజుకు రూ.3వేల చొప్పున ప్రతి 10 రోజులకు ఒకసారి అదనపు ఎక్స్ గ్రేషియా చెల్లిస్తారు. అవాంచిత ఘటనల్లో అయితే రూ.1500 గా ఉంటుంది. ఇలా 6 నెలల వరకు ఇస్తారు. ఆ తర్వాత రోజుకు రూ.750 చొప్పున మరో5 నెలలు ఇస్తారు.

Indian Railways has taken a crucial decision.

నిబంధనలు అతిక్రమించినవారికి, రైలు మార్గాల విద్యుదీకరణ వ్యవస్థ వల్ల కరెంట్ షాక్ కు గురైనవారికి, సెక్యూరిటీ లేని లెవల్ క్రాసింగ్ గేట్ల వద్ద జరిగే ప్రమాదాలకు ఎక్స్ గ్రేషియా లభించదు. ఒరిస్సాలోని బాలసోర్ వద్ద కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఆకస్మికంగా ప్రాణాలు కోల్పోయినవారికి రైల్వే ఇస్తున్న నష్టపరిహారం చాలా తక్కువని విమర్శలు వచ్చాయి. వీటిని దృష్టిలో ఉంచుకొని నిబంధనలను తాజాగా సడలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+