దూసుకొస్తున్న హైడ్రోజన్ రైలు.. ట్రయల్ రన్ ఎప్పుడంటే..
భారతదేశంలో రైల్వే ప్రగతి పథంలో దూసుకుపోతుంది. ఇందులో భాగంగా భారతదేశంలోని తొలి హైడ్రోజన్ రైలు పట్టాలు ఎక్కడానికి రెడీ అయింది. 2030 నాటికి భారత్లో కార్బన్ ఉద్గారాలను తగ్గించాలని కేంద్రం కసరత్తు చేస్తున్న క్రమంలో హైడ్రోజన్ రైళ్ళను సిద్ధం చేస్తుంది. ఇప్పటికే వందే భారత్ రైళ్లతో రైల్వే వ్యవస్థలో జెడ్ స్పీడు రైళ్లను ప్రవేశపెట్టిన ఇండియన్ రైల్వే తొలి హైడ్రోజన్ రైలుతో సెన్సేషన్ సృష్టించబోతుంది.
హైడ్రోజన్ రైలు పట్టాలెక్కడానికి ముహూర్తం ఫిక్స్
ఇక ఈ హైడ్రోజన్ రైలు పట్టాలెక్కడానికి ముహూర్తం ఫిక్స్ చేసింది. వచ్చే సంవత్సరం ఈ హైడ్రోజన్ రైలు అందుబాటులోకి రాబోతుంది. డిసెంబర్ నెలాఖరులో ఈ రైలు ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. తొలిసారిగా ఈ రైలు జింద్ సోనిపట్ మార్గంలో నడవనుంది. ఇది ఢిల్లీ రైల్వే డివిజన్లో 89 కిలోమీటర్ల మార్గంలో రాకపోకలు సాగించనుంది.

పర్యావరణానికి హాని కలిగించని హైడ్రోజన్ ఫర్ హెరిటేజ్
భారతీయ రైల్వే భారీ ప్రణాళికలో భాగంగా నేషనల్ హెరిటేజ్ మరియు కొండ ప్రాంతాలలో 35 హైడ్రోజన్ రైళ్లను నడపాలని నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాజెక్టులకు హైడ్రోజన్ ఫర్ హెరిటేజ్ గా పేరు పెట్టింది. ఈ రైళ్లతో పర్యావరణానికి హాని కలుగకుండా, ఎలాంటి కాలుష్యం లేకుండా ఉండే అవకాశం ఉంది. 2030 నాటికి ఈ రైళ్లు కార్బన్ రహిత రైల్వే ను సాధించే దిశగా లక్ష్యాన్ని ఏర్పరచుకొని రూపొందిస్తున్నారు.
బడ్జెట్లో 35 హైడ్రోజన్ రైళ్లకు 2800 కోట్ల రూపాయల కేటాయింపు
ఈ సంవత్సరం బడ్జెట్లో 35 హైడ్రోజన్ రైళ్లకు 2800 కోట్ల రూపాయలను కేంద్రం కేటాయించింది. అంతేకాదు హెరిటేజ్ మార్గాలలో హైడ్రోజన్ సంబంధిత మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రత్యేకంగా 600 కోట్ల రూపాయలను ఇచ్చింది. ఇక ఈ రైళ్లలో హైడ్రోజన్ తో విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది.
హైడ్రోజన్ రైల్వే ప్రాజెక్టు కోసం భారీగా ఖర్చు చేస్తున్న రైల్వే శాఖ
హెచ్ ఓ జి సాంకేతికతతో రైలుకు కావలసిన విద్యుత్ అంతా లోకమోటిలోనే ఉత్పత్తి అవుతుంది. ఇదే సమయంలో ఈ రైల్వే ప్రాజెక్టు కోసం భారీగా ఖర్చు చేస్తున్న రైల్వే శాఖ ఈ రైల్వే మార్గాలలో మొక్కలు నాటడంతో పాటు, రైల్వే స్టేషన్లలో సోలార్ విద్యుత్ ప్లాంట్ లను సైతం ఏర్పాటు చేస్తుంది. ప్రస్తుతం భారతీయ రైల్వేకు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిన ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే పర్యావరణానికి మరింత మేలు జరగనుంది.












Click it and Unblock the Notifications