నిషేధం: జేసీకి ఎయిరిండియా-ఇండిగో షాక్, చంద్రబాబు సీరియస్

Posted By:
Subscribe to Oneindia Telugu

విశాఖ: విశాఖపట్నం విమానాశ్రయంలో ఇండిగో విమానాశ్రయ సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించిన అనంతపురం తెలుగుదేశం పార్టీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి భారీ షాక్. ఆయనను ఎయిర్ ఇండియా, ఇండిగో విమానయాన సంస్థలు నిషేధం విధించాయి.

స్నేహంతో అధికారిని తోసేశా: ఎయిర్ పోర్ట్‌లో రచ్చపై జేసీ సంచలన వ్యాఖ్యలు

ఈ మేరకు గురువారం నిర్ణయం తీసుకున్నాయి. జేసీ దివాకర్ రెడ్డిని తమ విమానాల్లో అనుమతించబోమని తేల్చి చెప్పాయి. ఇండిగో విమానాశ్రయ సిబ్బందిపై జేసీ దురుసుగా ప్రవర్తించారు. దీంతో వారు నిషేధం విధించారు. ఎయిర్ ఇండియా కూడా సంఘీభావంగా నిషేధం విధించింది.

IndiGo, Air India bar TDP MP JC Diwakar Reddy from its flights after ruckus at Vizag airport

45 ని.ల ముందు రావాలి కానీ 28 ని.ల ముందే..

ఎయిర్ పోర్టుకు 45 నిమిషాల ముందు రావాల్సి ఉండగా, జేసీ దివాకర్ రెడ్డి 28 నిమిషాల ముందు మాత్రమే వచ్చారని అధికారులు వెల్లడించారు.

అశోక్ గజపతి రాజు జోక్యంతో..

కాగా, గురువారం ఉదయం అధికారులతో జేసీ దివాకర్ రెడ్డి వాగ్వాదానికి దిగారు. తనకు బోర్డింగ్ పాస్ ఇవ్వాలని మండిపడ్డారు. దీంతో వారు ఇవ్వడం కుదరదని చెప్పారు. దీంతో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు కల్పించుకొని ఆయనకు బోర్డింగ్ పాస్ ఇప్పించారని తెలుస్తోంది.

చంద్రబాబు సీరియస్

అనంత ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తీరుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర అసహనంతో ఉన్నారని తెలుస్తోంది. గతంలో, ఇప్పుడు జేసీ తీరుపై సర్వత్రా చర్చనీయంశం కావడం చంద్రబాబును ఆగ్రహానికి గురి చేసిందని తెలుస్తోంది. జేసీ తీరుపై ఆయన ఆవేదనగా ఉన్నారని చెబుతున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Budget airline IndiGo announced its decision to bar TDP MP JC Diwakar Reddy from its flights after the MP created ruckus at the Vishakapatnam airport earlier Thursday.
Please Wait while comments are loading...