ఇంద్రకీలాద్రిపై పోటెత్తిన భక్తులు - అమ్మవారికి సీఎం పట్టువస్త్రాలు..!!
శరన్నవరాత్రుల వేళ ఇంద్రకీలాద్రి భక్తులతో పోటెత్తింది. నేడు మూలా నక్షత్రం సందర్భంగా తెల్లవారుజామున రెండు గంటల నుండి అమ్మవారిని దర్శించుకోవడానికి క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు. నేడు అమ్మవారు భక్తులకు సరస్వతి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అంచనాలకు మించి భక్తులు తెల్లవారుజాము నుంచే ఆలయానికి తరలివచ్చారు. ఈ రోజు ముఖ్యమంత్రి జగన్ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.
ఇంద్రకీలాద్రిపై ఆరో రోజు దసరా మహోత్సవాలు జరుగున్నాయి. అమ్మవారు సరస్వతీ దేవి అలంకారంలో దర్శనమిస్తున్నారు. అమ్మవారి జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రం కావటంతో ఇంద్రకీలాద్రికి భక్తులు పోటెత్తారు. పలువురు ప్రముఖులు అమ్మవారిని దర్శించుకొనేందుకు తరలి వచ్చారు. ఇంద్రకీలాద్రిపై వినాయకుడి గుడి నుంచి కొండపై వరకు భక్తులతో క్యూలైన్లు కిటకిటలాడుతున్నాయ. సుమారు నాలుగు లక్షల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేసారు. క్యూలైన్లు నిండిపోవటంతో వీఎంసీ వద్ద పోలీసులు కంపార్టుమెంట్లను ఏర్పాటు చేసారు.

ఈ రోజు మధ్నాహ్నం ముఖ్యమంత్రి జగన్ అమ్మవారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఇక, మూలానక్షత్రం సందర్భంగా విశాఖలోని శారదీపీఠంలో అక్షరాభ్యాసాలు జరగనున్నాయి. రాజశ్యామల అమ్మవారు సరస్వతి దేవి అవతారంలో దర్శనమివ్వనున్నారు. దేవాలయంలో ఘనగా పూజలు జరుగుతున్నాయి. రాత్రి 11 గంటల వరకు క్యూలైన్లో వచ్చిన భక్తులకు దర్శనం కల్పిస్తారు. సాధారణంగా దసరా మొదటి రోజున స్వర్ణకవచాలాంకృత దుర్గాదేవిగా దర్శనమిచ్చే అమ్మవారు ఈసారి బాలా త్రిపుర సుందరీదేవిగా దర్శనమివ్వనున్నారు.
23న విజయదశమిని పురస్కరించుకొని ఉదయం 10.30 గంటలకు యాగశాలలో పూర్ణాహుతి కార్యక్రమం, సాయంత్రం గంగా పార్వతీ సమేత దుర్గామల్లేశ్వరస్వామి వార్ల ఉత్సవమూర్తుల తెప్పోత్సవాన్ని నిర్వహించేందుకు వైదిక కమిటీ సభ్యులు నిర్ణయించారు. 21న దుర్గాదేవి, 22న మహిషాసురమర్దిని, 23న రాజరాజేశ్వరీదేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారని వైదిక కమిటీ సభ్యులు తెలిపారు. ఇక, రాజకీయ ప్రముఖులు అమ్మవారి దర్శనం కోసం తరలి వస్తున్నారు. తెలంగాణలో ఎన్నికల వేళ ఇంద్రకీలాద్రిపై అమ్మవారి దర్శనం కోసం పెద్దసంఖ్యలో ప్రముఖులు విజయవాడకు చేరుకుంటున్నారు. ఈ నెల 23వ తేదీ వరకు కొండ పైన రద్దీ కొనసాగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications