దసరాకి బెజవాడ దుర్గమ్మ దర్శనం, సేవ టికెట్లు విడుదల- ఇలా బుక్ చేసుకోండి..!!

దసరా వేడుకలకు ఇంద్రకీలాద్రి ముస్తాబవుతోంది. విజయవాడ కనకదుర్గ ఆలయంలో ఈ నెల 22 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు జరగనున్న శరన్నవరాత్రుల సందర్భంగా నిర్వహించే ప్రత్యేక సేవలకు ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. ప్రతీ ఏటా దసరా వేళ అమ్మవారి దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తారు. దీంతో, దర్శనం.. ఆర్జిత సేవా ఆన్ లైన్ టికెట్లను ఆలయ అధికారులు విడుదల చేసారు. ప్రత్యక్షంగా హాజరు కాలేని వారికి సైతం ఆన్ లైన్ సేవలు చేయించుకునే అవకాశం కల్పిస్తున్నారు.

ప్రతీ ఏటా ఇంద్రకీలాద్రి పై కొలువై ఉన్న కనకదుర్గ అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవం గా నిర్వహిస్తారు. కాగా, ఈ సారి ఆర్జిత సేవల టికెట్లను ఆన్‌లైన్లో విడుదల చేశారు. ప్రభుత్వ వాట్సాప్ సేవల నెంబర్ 9552300009లో ఈ టికెట్లు కొనుగోలు చేయవచ్చునని అధికారులు తెలిపారు. ఉత్సవాలకు హాజరుకాలేని వారు ఆన్‌లైన్‌లో ఆర్జిత సేవలు చేయించుకునేందుకు రూ.1,500 చెల్లించి వీడియో లింక్ ద్వారా పూజలను వీక్షించవచ్చునని అన్నారు. దుర్గామల్లేశ్వర దేవస్థానంలో ఈనెల 22 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు దసరా మహోత్సవాల నిర్వహణకు నిర్ణయించారు. ఈ మహోత్సవాల్లో నిర్వహించే ప్రత్యేక ఖడ్గమాలార్చన, కుంకుమార్చన, శ్రీచక్రనవావరణార్చన, చండీయాగం టికెట్లను విడుదల చేసారు.

indrakeeladri-temple-officials-releases-darshan-and-seva-tickets-for-dasara

ఖడ్గమాలార్చన ఈనెల 23 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు పదిరోజుల పాటు ఒక షిప్టు మాత్రమే నిర్వహిస్తారు. ఉదయం 5గంటల నుంచి 6గంటల వరకు నిర్వహించే ఖడ్గమాలార్చనకు రుసుం రూ.5,116చెల్లించాల్సి ఉంటుంది. 22వ తేదీ దసరా ప్రారంభం రోజున అమ్మవారికి స్నపన కార్యక్రమం ఉన్నందున ఆ రోజు ఖడ్గమాలార్చన ఉండదు. ప్రత్యేక కుంకుమార్చనకు మూలా నక్షత్రం రోజున రూ.5వేలు రుసుం చెల్లించాలి.

మిగతా అన్ని రోజులు రూ.3వేల చొప్పున రుసుం చెల్లించాలి. దసరా ప్రారంభం రోజున ఉదయం 9గంటల నుంచి మాత్రమే నిర్వహిస్తారు. ప్రత్యేక చండీయాగం ఉదయం 9గంటల నుంచి ఒక షిప్టు మాత్రమే నిర్వహిస్తారు. రుసుం రూ.4వేలు చెల్లించాలి. రుసుం చెల్లించిన భక్తులు పూజలో పాల్గొనేందుకు సంప్రదాయ వస్త్రధారణలోనే రావాలి. వాట్సాప్‌లో ఈ నెంబర్ 95523 00009 కు హాయ్ అని మెస్సేజ్ చేయటం ద్వారానూ ఈ టికెట్లు పొందే అవకాశం కల్పించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+