శ్రీశైలానికి వరద పోటు- గేట్లను నిపుణులు పరిశీలించడం వెనుక?

Srisailam Dam: మహారాష్ట్ర, కర్ణాటక సహా ఎగువ పరీవాహక ప్రాంతాల్లో కురుస్తోన్న భారీ వర్షాల వల్ల కృష్ణానది జలకళను సంతరించుకుంది. వరదనీటితో పోటెత్తుతోంది. భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఫలితంగా జోగుళాంబ గద్వాల జిల్లాలోని ఇందిరా ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు నిండుకుండలా మారింది. గరిష్ఠస్థాయి నీటిమట్టాన్ని అందుకుంది.

దీంతో గేట్లను ఎత్తివేశారు అధికారులు. వరద నీటిని దిగువకు వదులుతున్నారు. జూరాల గేట్లను ఎత్తివేయడం ఈ సీజన్ లో ఇది రెండోసారి. దీని ప్రభావం నంద్యాల జిల్లా శ్రీశైలం రిజర్వాయర్ పై భారీగా పడుతోంది. శ్రీశైలం వైపు కృష్ణమ్మ పరుగులు పెడుతోంది. ఈ భారీ రిజర్వాయర్ నీటిమట్టం క్రమంగా పెరుగుతూ వస్తోంది.

Inflow increased into the Srisailam dam due to heavy rains

మహారాష్ట్ర, కర్ణాటకల్లో కొద్దిరోజులుగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తోన్న విషయం తెలిసిందే. దీని ప్రభావంతో అటు గోదావరి, ఇటు కృష్ణానదికి వరద పోటుకు గురయ్యాయి. భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. కృష్ణా ఉపనదులు ఘటప్రభ, మలప్రభ, భీమా, తుంగ, భద్ర సైతం పొంగిపొర్లుతున్నాయి.

కర్ణాటకలోని ఉత్తర కన్నడ, బెళగావి, హవేరి, విజయపురా, బాగల్‌కోటె, కలబురగి, బళ్లారి.. వంటి జిల్లాల్లో అతి భారీగా వర్షాలు కురిశాయి. ఆయా ప్రాంతాలన్నీ కూడా కృష్ణా బేసిన్ పరిధిలోకి వచ్చేవే. అటు మహారాష్ట్రలోనూ కృష్ణా ఎగువ పరీవాహక ప్రాంతాల్లో ఏకధాటిగా వర్షాలు పడుతున్నాయి.

ఫలితంగా కృష్ణానది ఉరకలేస్తోంది. కర్ణాటకలో దీనిపై నిర్మించిన ప్రాజెక్టులన్నీ నిండిపోయాయి. ఆలమట్టి, నారాయణ్‌ పూర్ ప్రాజెక్టులు గరిష్ఠ నీటి మట్టానికి చేరుకున్నాయి. ఇటీవలే వాటి గేట్లను ఎత్తివేశారు కర్ణాటక జలవనరుల అధికారులు. లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.

దీని ప్రభావంతో జూరాల ప్రాజెక్టుకు భారీగా వరదనీరు చేరుకుంటోంది. అక్కడ గేట్లు ఎత్తేయడంతో శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు చేరుకుంటోంది. క్రమంగా నిండుతోంది. ఇన్ ఫ్లో దాదాపుగా 1,71,208 క్యూసెక్కులుగా నమోదైంది. అవుట్ ఫ్లో 67,399 క్యూసెక్కులుగా ఉంటోంది. ఇదే తాకిడి మున్ముందు కూడా కొనసాగితే.. మూడు నాలుగు రోజుల్లో గేట్లను ఎత్తివేసే అవకాశాలు లేకపోలేదు.

శ్రీశైలం రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం నీటిమట్టం 878.40 అడుగులకు చేరుకుంది. 216 టీఎంసీలకు పైగా నీటిని నిల్వ చేసే సామర్థ్యం ఉందీ జలాశయానికి. ప్రస్తుతం ఈ స్థాయికి చేరుకోలేదు. ప్రస్తుతం 179.89 టీఎంసీల మేర నీళ్లు నిల్వ ఉన్నాయి.

10 నంబర్ గేట్ దెబ్బతిన్న నేపథ్యంలో నిపుణుడు కన్నయ్య నాయుడు పరిశీలించారు. రేడియల్ క్రస్ట్ గేట్లకు క్రమం తప్పకుండా పెయింటింగ్ వేస్తుండాలని సూచించారు. వచ్చే అయిదు సంవత్సరాల్లో రేడియల్ క్రస్ట్ గేట్లు కొత్తవి మార్చుకోవాలని సూచించారు. జలాశయం నుంచి 60 మీటర్ల దూరంలో ప్లంజ్ పూల్ ఏర్పడింది.. దీని వల్ల జలాశయానికి ప్రస్తుతం ప్రమాదం లేదని పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+