Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కూలీలతో కలిసి పొలం పనుల్లో రైతుగా.. మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే రూటే సపరేటు!!

మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి.. ఆయన రూటే సపరేటు.. సామాన్యుల్లో సామాన్యుడిగా కలిసిపోవటం, ఎమ్మెల్యే అయినా నిత్య కృషీవలుడిగా వ్యవసాయం చెయ్యటంలో ఆయనకు ఆయనే సాటి. ఇప్పుడు వర్షాలు పడుతున్న క్రమంలో ఖరీఫ్ సీజన్ కావటంతో ఏరువాకా సాగారో అంటూ వ్యవసాయం చేస్తున్న ఆర్కే మంగళగిరి నియోజకవర్గ రైతాంగానికి మార్గదర్శిగా మారారు.

మట్టిని నమ్ముకున్న రైతుగా మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే

మట్టిని నమ్ముకున్న రైతుగా మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే

తెల్ల చొక్కా నలగకుండా, కారులో నుండి కాలు క్రింద పెట్టకుండా రాజకీయాలు చేసే నాయకులు ఉన్న నేటి రోజుల్లో మట్టిని నమ్ముకున్న ఒక రైతుగా వ్యవసాయం చెయ్యటం , తాను ఎమ్మెల్యే అని కించిత్తు గర్వం లేకుండా అతి సామాన్యంగా వ్యవహరించటం ఆళ్ళ రామకృష్ణారెడ్డి స్పెషాలిటీ. ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు ఉన్నాయి కాబట్టే మంగళగిరి ప్రజలు లోకేష్ పోటీ చేసినా ఆళ్ళ రామకృష్ణా రెడ్డి కి ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారని లోకల్ టాక్. ఇక ఇప్పుడు వ్యవసాయ పనులు ప్రారంభం అయిన వేళ ఆళ్ళ రామకృష్ణారెడ్డి పొలం పనుల్లో బాగా బిజీ అయ్యారు.

సాగు పనుల్లో బిజీ అయిన మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే

సాగు పనుల్లో బిజీ అయిన మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే

వ్యవసాయం అంటేనే నేడు చాలా మంది రైతులు సైతం ఆమడ దూరం పారిపోతుంటే ఆయన మాత్రం వ్యవసాయంపై మక్కువతో సాగు పనుల్లో బిజీ అయ్యారు. కూలీలతో కలిసి వ్యవసాయ పనులు చేస్తున్నారు.సీజన్ వస్తే చాలు రైతుగాపొలం పనులు చేస్తూ వ్యవసాయం పట్ల తన ప్రేమను తెలియజేస్తూ ఉంటారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలలోకీలక భూమిక పోషిస్తూనే వ్యవసాయాన్ని మాత్రం వదలకుండా పంటలు పండిస్తున్నారు ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ రెడ్డి.ఈ పని, ఆ పని అన్న తేడా లేకుండా వ్యవసాయ పనులన్నీ చేస్తూ ఆర్కే అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటారు. ఎమ్మెల్యే గిరీ పక్కన పెట్టి తలపాగా చుట్టి రైతుగా మారుతారు.

ఓ పక్క ఎమ్మెల్యేగా గడప గడపకు ప్రచారం .. మరోపక్క వ్యవసాయం

ఓ పక్క ఎమ్మెల్యేగా గడప గడపకు ప్రచారం .. మరోపక్క వ్యవసాయం

ప్రజాసేవలో,మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధిలో కీలకంగా పని చేస్తూనే వ్యవసాయ పనుల విషయంలో కూడా రాజీ లేకుండా కృషి చేస్తున్నారు.ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైసీపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా కొనసాగిస్తున్న గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని కొనసాగిస్తూనే, వ్యవసాయ పనుల్లోనూ ఆళ్ల రామకృష్ణారెడ్డి బిజీ అవుతున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తూనే, రైతుగా తన వంతు కర్తవ్యంగా వ్యవసాయాన్ని చేస్తున్నారు.

కూలీలతో కలిసి పొలంలో నారుమడి విత్తనాలు చల్లిన ఎమ్మెల్యే ఆర్కే

కూలీలతో కలిసి పొలంలో నారుమడి విత్తనాలు చల్లిన ఎమ్మెల్యే ఆర్కే

ఇక తాజాగా ఫిరంగిపురం మండలం వేమవరం గ్రామంలోని తన పొలంలో కూలీలతో కలిసి వ్యవసాయ పనులు చేశారు ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి. కలుపు తీసి, పొలంలో నాట్లు వేయడానికి నాగలి పట్టి పొలాన్ని దున్నారు. అనంతరం నారుమడికి విత్తనాలు చల్లి, కంది నాటారు. మోకాళ్ళ లోతు నీళ్లలో బురదలో వ్యవసాయ కూలీలతో కలిసి పని చేశారు. అంతేకాదు వ్యవసాయ కూలీలతో పాటు పొలంలోనే భోజనం చేసి తిరిగి వ్యవసాయ పనులలో ఆయన నిమగ్నమయ్యారు. అక్కడ పనిచేస్తున్న కూలీలకు, రైతులకు స్ఫూర్తినిచ్చారు ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+