అవమానం: చిన రాజప్పకు చంద్రబాబు ఫోన్, ఆయన క్షమాపణ

Posted By:
Subscribe to Oneindia Telugu
రాజీనామాకు సిద్ధపడిన చిన రాజప్ప

అమరావతి: తనకు జరిగిన అవమానానికి అలిగిన డిప్యూటీ సిఎం చినరాజప్పను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు బుజ్జగించే పనిలో పడ్డారు. ఆయనకు చంద్రబాబు శుక్రవారం ఫోన్ చేశారు.

తుళ్లూరులో రూ. 150 కోట్లతో నిర్మించనున్న ఫోరెన్సిక్ ల్యాబ్ కు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గురువారం శంకుస్థాపన చేసిన విషయం తెెలిసిందే. తనకు పంపిన ఆహ్వానం విషయంలో అవమానం జరిగిందని చినరాజప్ప అలిగారు. కార్యక్రమానికి గైర్హాజరయ్యారు.

 చిన రాజప్పకు ఆయన క్షమాపణ

చిన రాజప్పకు ఆయన క్షమాపణ

చినరాజప్పకు ఫోరెన్సిక్ ల్యాబ్ డైరెక్టర్ గాంధీ క్షమాపణలు చెప్పారు. చిన రాజప్పకు ఆహ్వానం పంపే విషయంలో జరిగిన లోపంపై చంద్రబాబు ఆరా తీసి అసలు విషయం తెలుసుకున్నారు. దానిపై సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

 చిన రాజప్పకు ఫోన్ చేసిన చంద్రబాబు

చిన రాజప్పకు ఫోన్ చేసిన చంద్రబాబు

చినరాజప్పక చంద్రబాబు శుక్రవారం ఫోన్ చేశారు. జరిగిన విషయాన్ని తాను తెలుసుకున్నానని చెబుతూ సాయంత్రం వచ్చి కలవాలని ఆయన చినరాజప్పకు చెప్పారు. జరిగిన పొరపాటుకు చింతిస్తున్నామని, హోంమంత్రికి క్షమాపణ చెబుతున్నామని ఫోరెన్సిక్ ల్యాబ్ డైరెక్టర్ గాంధీ తెలిపారు.

 చిన రాజప్ప రాజీనామాకు సిద్ధపడినట్లు.

చిన రాజప్ప రాజీనామాకు సిద్ధపడినట్లు.

తనకు జరిగిన అవమానానికి డిప్యూటీ సిఎం రాజీనామాకు సిద్ధపడినట్లు తెలుస్తోందంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. హోం మంత్రిత్వ శాఖను నిర్వహిస్తున్న తనకే తన శాఖ నుంచి అవమానం ఎదురు కావడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోయినట్లు చెబుతున్నారు.

 చిన రాజప్పకు ఆహ్వానం ఇలా..

చిన రాజప్పకు ఆహ్వానం ఇలా..

ఆ కార్యక్రమం ముందుగానే ఖరారైనప్పటికీ సంబంధిత హోం శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చిన రాజప్పకు ప్రభుత్వ శాఖ నుంచి లేదా డీజీపీ కార్యాలయం నుంచి కాకుండా ఒక సాధారణ కానిస్టేబుల్ ద్వారా పోలీసు శాఖ నుంచి ఆహ్వానం అందింది. దీంతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురయ్యారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకలల జీవిత భాగస్వామిని కనుగొనండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
It is said that Andhra Pradesh CM Nara Chandrababu Naidu has pacified Deputy CM China Rajappa's distress.
Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి