బాబుకు తెలుస్తుందనా: ఎదురుగా రోజా.. వంశీకి విచిత్ర అనుభవం?
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఇటీవల ఓ ఇబ్బందికర సన్నివేశం ఎదురైందని తెలుస్తోంది. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లడానికి ఆయన గన్నవరం విమానాశ్రయానికి వచ్చారు.
అమరావతి: తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఇటీవల ఓ ఇబ్బందికర సన్నివేశం ఎదురైందని తెలుస్తోంది. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లడానికి ఆయన గన్నవరం విమానాశ్రయానికి వచ్చారు.
ఆయన వెనుక రెండు, మూడు వాహనాల్లో ఆయన అనుచరులు విమానాశ్రయానికి వచ్చారు. విమానాశ్రయ లాంజ్‌లోకి వెళ్లిన ఆయనకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా కనిపించారు.

అనుచరులు చెప్పడంతో..
దీంతో, ఆయన తన అనుచరులతో కలసి రెండడుగులు వెనక్కు వచ్చారు. ఆ తర్వాత రోజా తమ వైపే వస్తుండటంతో ఆ విషయాన్ని అనుచరులు ఆయనకు చెప్పారు.

విమానాశ్రయం బయటకు..
దీంతో, అనుచరులతో మాట్లాడుతూనే ఆయన విమానాశ్రయం బయటకు వచ్చేశారు. ఈ విషయం గమనించి రోజా అక్కడే ఆగిపోయారు.

తప్పించుకొని తిరుగుతున్నారని అడగగా..
ఆ తర్వాత ప్రయాణం కోసం బోర్డింగ్ అయింది. వంశీ విమానంలో ఎక్కారు. ఈ సందర్భంగా ఆయనను చూసిన రోజా... ఏంటి వంశీ గారు, తప్పించుకుని తిరుగుతున్నారని నవ్వుతూ ప్రశ్నించారు.

ఇదీ కారణమని వంశీ..
అందుకు వంశీ.. ఏం లేదండీ.. అనుచరులతో మాట్లాడుతున్నానని , గమనించలేదని చెప్పారట. అయితే, వంశీ అళా చేయడానికి మరో కారణం ఉందని అంటున్నారు.

చంద్రబాబుకు తెలుస్తే..
రోజాతో ఏదైనా మాట్లాడితే ఆ విషయం బయటకు తెలిస్తే ఆ తర్వాత ఆ సంగతి అధినేత చంద్రబాబుకు తెలిస్తే ఏమవుతుందో అనే భయంతోనే వంశీ తప్పించుకుని తిరిగే ప్రయత్నం చేశారనే ప్రచారం సాగుతోంది.












Click it and Unblock the Notifications