తిరుపతి తొక్కిసలాట వెనుక - వారే కారణం, వాట్ నెక్స్ట్..!!
తిరుపతి తొక్కిసలాట ఘటన సంచలనం రేపింది. ఆరుగురు భక్తులు ఈ ఘటనలో ప్రాణాలు కో ల్పోయారు. ప్రభుత్వం ఘటన తరువాత కొందరు అధికారుల పైన చర్యలు తీసుకుంది. డిప్యూటీ సీఎం పవన్ ఈ ఘటన పట్ల క్షమాపణ చెప్పారు. బాధితులకు టీటీడీ పరిహారం చెల్లించింది. ఇక, ఈ ఘటన పైన విచారణ కోసం ప్రభుత్వం న్యాయ విచారణకు ఆదేశించింది. విచారణ సమయం లో బాధితులు కీలక అంశాలను వెల్లడించారు.
తిరుపతి తొక్కిసలాట ఘటన వెనుక కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఘటన పై ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిటీ విచారణ కొనసాగుతోంది. జస్టిస్ సత్యానారాయణ మూర్తి ఈ ఘటన పైన విచారణ వేగవంతం చేసారు. తాజాగా విజయవాడ నుంచి వర్చువల్ విధానంలో బాధితులను విచారించారు. విశాఖ నుంచి ఒకరు, పాలకొల్లు నుంచి మరొకరు ఈ విచారణలో పాల్గొన్నారు. టీటీడీ, పోలీసుల అధికారుల నిర్లక్ష్యం కారణంగానే తన భార్య శాంతి మృతి చెందిందని విశాఖకు చెందిన వెంకటేష్ కమిషన్ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.

తొక్కిసలాట ఘటన వేళ చోటు చేసుకున్న పరిణామాలను ఆయన వివరించారు. మరో బాధితుడు ధనకుమార్ అనే వ్యక్తి పాలకొల్లు నుంచి విచారణకు హాజరయ్యారు. తొక్కిసలాట లో తీవ్రంగా గాయపడ్డానని పేర్కొన్నారు. విజయనగరం నుంచి మరో ఇద్దరు రావాల్సి ఉండగా.. వారు గైర్హాజ రయ్యారు. ప్రత్యక్ష సాక్ష్యులైన పార్కు చుట్టుపక్కల ఉన్న 20 మంది దుకాణదారుల ను శుక్రవారం విచారించనున్నారు. ఈ ఘటన సమయంలో టీటీడీ ఈవో - ఏఈవో మధ్య సమన్వ యలోపం ఉందని డిప్యూటీ సీఎం పవన్ వ్యాఖ్యానించారు. ఈ ఇద్దరి పైనా చర్యలు ఉంటాయని ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరిగింది. అయితే, ఇప్పటి వరకు ఈ ఇద్దరి విషయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి చర్యలు లేవు. ఇప్పుడు విచారణ వేళ బాధితులు వెల్లడించిన అంశాలు... కమిషన్ ఇచ్చే నివేదిక ఆధారంగా ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications