ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!!

ఇంటర్ విద్యార్ధులకు బిగ్ అలర్ట్. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్ ఫలితాలకు ముహూర్తం ఖరారు అయింది. ఈ సారి త్వరగా ఫలితాలు త్వరగా విడుదల చేయాలని రెండు రాష్ట్రాల్లో ఇంటర్ బోర్డు అధికారులు నిర్ణయించారు. వాల్యూయేషన్ విషయంలో ఎలాంటి పొరపాట్లు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఫలితాలు ఆలస్యం కారణంగా.. ఇతర పోటీ పరీక్షల విషయంలో వస్తున్న ఇబ్బందుల కారణంగా ఈ సారి ముందుగానే విడుదలకు నిర్ణయించారు. ఈ మేరకు రెండు రాష్ట్రాల ఇంటర్ అధికారులు తేదీలు ఖరారు చేసారు.

తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్‌ పరీక్షల ఫలితాల విడుదలకు ముహూర్తం ఫిక్స్ అయింది. తెలంగాణ ఇంటర్ ఫస్ట్‌, సెకండ్‌ ఇయర్‌ పబ్లిక్‌ పరీక్షలు ముగియటంతో..మార్చి 25 నాటికి మూల్యాంకనం ప్రక్రియ కూడా పూర్తి చేసి ఏప్రిల్‌ 6వ తేదీ నాటికే ఫలితాలు విడుదల చేయనున్నారు. ఏప్రిల్‌ 24 నుంచి వేసవి సెలవులు మొదలవుతాయి. జూన్‌ 1 నుంచి తిరిగి జూనియర్‌ కాలేజీలు పునః ప్రారంభం కానున్నాయి. ఈలోగా అడ్వాన్స్‌ సప్లమెంటరీ పరీక్షలను కూడా ముగించి మే 31 నాటికి ఫలితాలు ప్రకటించాలని ఇంటర్ బోర్డు అధికారులు భావిస్తున్నారు. ఇదే సమయం లో ఎక్కడా పొరపాట్లకు తావులేకుండా అత్యంత పారదర్శకంగా ఫలితాలను విడుదల చేసేందుకు అధికార యంత్రాంగం పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు. ఏప్రిల్ 3వ తేదీ నాటికి వాల్యుయేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని బోర్డు లక్ష్యంగా పెట్టుకుంది. ఆ తర్వాతి మూడు రోజుల్లో సాంకేతిక ప్రక్రియ, కోడింగ్, డీకోడింగ్ పనులను పూర్తి చేసి.. ఏప్రిల్ 6, 8 లేదా 9 తేదీల్లో ఫలితాలను విడుదల చేసే అవకాశం ఉంది.

intermediate-results-dates-finalized-in-ap-telangana-as-latest-discussions-here-the-details

ఈ సారి త్వరగానే ఫలితాల వెల్లడికి నిర్ణయం

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందుబాటును బట్టి ఈ తేదీల్లో ఒక రోజును ఖరారు చేయనున్నారు. మొత్తానికి ఏప్రిల్ 10 లోపు విద్యార్థుల చేతికి మార్కుల జాబితా అందనుంది. అదే విధంగా ఏపీలో నూ ఏప్రిల్‌ రెండో వారంలోగా ఇంటర్మీడియట్‌ ఫలితాలను ప్రకటించే దిశగా రంగం సిద్ధం చేస్తున్నారు. మార్చి 22 నుంచి రాష్ట్రంలో ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం మొదలు పెట్టారు. ఇక ఇంటర్‌ పరీక్షా ఫలితాలను ఏప్రిల్‌ 10లోపు విడుదల చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. కాగా, 2026-27 అకడమిక్ క్యాలెండర్ ను అధికారులు వెల్లడించారు. అడ్మిషన్ల కోసం హోర్డింగులు, కరపత్రాలు, గోడలపై రాతలు, మీడియా ద్వారా ప్రచారం లాంటివి చేయకూడదని ఇంటర్‌ విద్యామండలి ప్రైవేటు జూనియర్‌ కాలేజీ యాజమాన్యాలకు స్పష్టం చేసింది. మీ పిల్లలను కచ్చితంగా ఉత్తీర్ణుల్ని చేస్తామనే హామీలు ఇవ్వకూడదని ఆదేశించింది. ఇలాంటివి నిబంధనలకు విరుద్ధమని పేర్కొంది. దీని ద్వారా ఇంటర్ ఫలితాలను వీలైనంత త్వరగా విడుదల చేయటం ద్వారా విద్యార్ధులకు ప్రయోజన కరంగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+