చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

స్మగ్లర్‌గా మారిన మోడల్: బడా ఎర్రచందనం స్మగ్లర్ భార్య సంగీత అరెస్ట్, ఏపీకి..

|
Google Oneindia TeluguNews

కోల్‌కతా/చిత్తూరు: ఆమె ఓ అందమైన మహిళ. ఒకప్పుడు ఎయిర్‌హోస్టెస్. ఆ తర్వాత మోడల్‌గా మారిపోయింది. ఇప్పుడు ఎర్రచందనం స్మగ్లర్‌గా 'ఆపరేషన్ రెడ్'లో పోలీసులకు దొరికిపోయింది. ఆమే అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ లక్ష్మణ్ భార్య సంగీత ఛటర్జీ.

లక్ష్మణ్.. ఎర్రచందనం దుంగల్ని చెన్నై, ముంబైతో పాటు విదేశాలకు సైతం తరలించేవాడు. 2014 జూన్‌లో ఇతన్ని అరెస్టు చేసిన చిత్తూరు పోలీసులు 2015 జూలై వరకు పీడీ యాక్టు కింద జైల్లో ఉంచారు. ఆ తర్వాత బెయిల్‌పై వచ్చిన లక్ష్మణ్ తన ప్రధాన అనుచరుడు విక్రమ్‌మెహందీతో కలిసి మళ్లీ ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తూ ఈ ఏడాది ఫిబ్రవరిలో చిత్తూరు పోలీసులకు పట్టుబడ్డారు.

తీగ లాగిన పోలీసులకు సంగీత విషయం వెలుగు చూసింది. లక్ష్మణ్ ఐదేళ్ల క్రితం సంగీతను రెండో పెళ్లి చేసుకున్నా డు. విలాసవంతమైన జీవనం సంగీత ప్రపంచం. కోల్‌కతాలో ఎయిర్‌హోస్ట్‌గా పనిచేసేప్పుడు పలువురు అంతర్జాతీ య స్మగ్లర్లతో ఈమెకు పరిచయాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కొద్దిరోజుల తరువాత మోడల్‌గా రాణించి పలు యాడ్స్‌లో కూడా నటించింది.

Intl red sanders smuggler's wife, an airhostess arrested

కాగా, లక్ష్మణ్ జైల్లో ఉన్న సమయంలో సంగీత ఉత్తర భారతానికి చెందిన పలువురు స్మగ్లర్లకు భారీగా నగదు ముట్టచెప్పి ఎర్రచందనం దుంగల్ని విదేశాలకు తరలినట్లు పోలీసులు గుర్తించారు. దీనిపై లోతుగా విచారిస్తే సంగీత చటర్జీ పేరు బయటకొచ్చింది. బర్మా నుంచి సంగీత హవాలా రూపంలో చెన్నైకు చెందిన ఎర్రచందనం స్మగ్లర్ మోజెస్ ద్వారా రూ.10 కోట్లకు పైగా చెల్లింపులు చేసినట్లు గుర్తించారు.

ఈమెను పట్టుకోవడానికి చిత్తూరు ఎస్పీ ఘట్టమనేని శ్రీనివాస్ నుంచి అధికారులకు ఆదేశాలు అందాయి. చిత్తూరు మహిళా డీఎస్పీ గిరిధర్, పశ్చిమ సీఐ ఎం.ఆదినారాయణ తమ సిబ్బందితో కలిసి కోల్‌కతాకు చేరుకున్నారు. శనివారం సంగీత చటర్జీను కోల్‌కతాలోని న్యూగరియాలో అరెస్టు చేశారు. ట్రాన్సిట్ వారెంట్‌పై చిత్తూరుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తే స్థానికంగా ఇబ్బందులు వచ్చాయి. దీంతో ఆమెను అక్కడి కోర్టులో అరెస్ట్ చూపించారు.

కాగా, ఒకరోజు తర్వాత సంగీత బెయిల్‌పై విడుదలైంది.ఈమెపై జిల్లాలో నాలుగు పోలీసు స్టేషన్లలో కేసులు ఉన్నాయి. యాదమరి, గుడిపాల, కల్లూరు, నిండ్ర స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. కోల్‌కతాలో బెయిల్ వచ్చినప్పటికీ మే 18న చిత్తూరుకు తీసుకురావడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

ఇక సంగీత అరెస్టు సమయంలో సీజ్ చేసిన ఆరు బ్యాంకు ఖాతాలు, రెండు లాకర్ల తాళాలు చిత్తూరు పోలీసుల వద్ద ఉన్నాయి. వీటిని తీసి చూస్తే మరిన్ని విషయాలు వెలుగు చూసే అవకాశం ఉందని పోలీసు అధి కారులు చెబుతున్నారు. కాగా, సంగీతను అరెస్ట్ చేసి కోర్టు ముందుకు తీసుకెళ్లిన సమయంలో పాతికమంది న్యాయవాదులు ఆమె తరపున కోర్టుకు హాజరవడం గమనార్హం.

English summary
International red sanders smuggler Laxmanan's wife and airhostess Sangeeta Chatterjee was arrested in Kolkata by Chittoor police. Police recovered bank accounts and lockers from her.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X