చెల్లని చెక్కు కేసు: మాజీ మంత్రి కుమారుడికి రెండేళ్ల జైలు, 20లక్షల జరిమానా
హైదరాబాద్: చెల్లని చెక్కు ఇచ్చిన కేసులో మాజీ మంత్రి విశ్వరూప్ కుమారుడు కృష్ణారెడ్డికి రెండేళ్ల జైలు శిక్ష పడింది. తన వద్ద తీసుకున్న అప్పు తీర్చేందుకు కృష్ణారెడ్డి చెల్లని చెక్కు ఇచ్చారని విజయలక్ష్మి అనే మహిళ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.
ఈ కేసును విచారించిన హైదరాబాద్‌లోని ఎర్రమంజిల్ న్యాయస్థానం కృష్ణారెడ్డికి రెండేళ్ల జైలు శిక్షతో పాటు రూ.20లక్షల భారీ జరిమానా విధించింది.

రూ.50 లక్షల ఎర్ర చందనం స్వాధీనం
నెల్లూరు: జిల్లాలోని సీతారాంపురం మండలం దేవమ్మచెరువు ఫారెస్టు ఏరియాలో శుక్రవారం ఉదయం అటవీ శాఖ అధికారులు విస్తృతంగా దాడులుచేసి 50 లక్షల రూపాయల విలువచేసే ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులను చూసి నిందితులు పరారయ్యారు.
ఆటోను ఢీ కొట్టిన బస్సు: 27 మందికి గాయాలు
అనంతపురం జిల్లా పెనుకొండ మండలంలోని మడకశిర రైల్వేగేటు వద్ద ఆటోను ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు గొయ్యిలోకి దూసుకెళ్లింది. ఈ సంఘటనలో 27 మంది గాయపడ్డారు. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది.
బస్సులో ప్రయాణిస్తున్న 23 మంది, ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. క్షతగాత్రుల వివరాలు తెలియాల్సి ఉంది.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications