చంద్రబాబు, పవన్ కు ఢిల్లీ పిలుపు - కండీషన్స్ అప్లై, ఇదే ఫైనల్..!!
ఏపీలో పొత్తుల లెక్కలు కొలిక్కి వస్తున్నాయి. బీజేపీ వైఖరి పైన స్పష్టత వస్తోంది. పొత్తు పైన సంకేతాలు ఇస్తూనే బీజేపీ తమ పట్టు పెంచుకొనే ప్రయత్నం చేస్తోంది. సీట్లతో పాటుగా పవర్ షేరింగ్ పైన ముందుగా అంగీకారినికి రావాలని షరతు పెడుతోంది. బీజేపీ అడుగుతున్న సీట్ల సంఖ్య పైన చంద్రబాబు, పవన్ ఒక నిర్ణయానికి వచ్చారు. ఈ ఇద్దరు నేతలను ఢిల్లీలో అందుబాటులో ఉండాలని బీజేపీ సూచించింది. ఇక, పొత్తు పైన తుది నిర్ణయం వెలువడనుంది.
ఢిల్లీ కేంద్రంగా :ఏపీలో జగన్ కు వ్యతిరేకంగా కూటమి కూర్పు దాదాపు ఖరారైంది. 2014 తరహాలోనే టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా పోటీకి రంగం సిద్దమవుతోంది. దీనికి సంబంధించి తుది చర్చల కోసం చంద్రబాబు, పవన్ ను ఢిల్లీలో అందుబాటులో ఉండాలని సూచించినట్లు తెలుస్తోంది. ఈ నెల 22,21 తేదీల్లో సమావేశం అయ్యేందుకు వీలుగా ఢిల్లీకి రావాలని కోరినట్లు సమాచారం. ముందుగా పార్టీ జాతీయాధ్యక్షుడు నడ్డా, ఏపీ ఇంఛార్జ్ మురళీధరన్ తో చంద్రబాబు, పవన్ చర్చలు చేయనున్నారు. ఆ తరువాత అమిత్ షా వద్ద పొత్తు, అధికారంలో భాగస్వామ్యం పైన ఒక అంగీకారానికి వచ్చే అవకాశం ఉంది. ఆ సమయంలో బీజేపీ కండీషన్ల పైన ఇరు పక్షాల నుంచి ఆమోదం లభిస్తే చివరగా ప్రధాని మోదీతో సమావేశం జరగనుంది.

సీట్లు - పంపకాలు: ఇక..పొత్తుల పైన..ఎన్డీఏలో చేరిక పైన అధికారికంగా ఢిల్లీ వేదికగా ప్రకటన చేయనున్నారు. బీజేపీ ఇప్పటికే 10 ఎంపీ, 25 ఎమ్మెల్యే స్థానాలు కోరుతోంది. వీటిపైన పవన్ తో చర్చించిన చంద్రబాబు చివరగా బీజేపీకి 6 ఎంపీ సీట్లు, 10 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. అదే సమయంలో జనసేనకు 22-25 ఎమ్మెల్యే, 3 ఎంపీ స్థానాల పైన అంగీకారం కుదిరినట్లు చెబుతున్నారు. రాజమండ్రి, నరసాపురం, రాజంపేట ఎంపీ స్థానాలు బీజేపీకి ఇచ్చేందుకు సిద్దమైన చంద్రబాబు...ఆ పార్టీ నేతలు కోరుతున్న విజయవాడ, విశాఖ, హిందూపురం పైన మాత్రం ఇంకా నిర్ణయానికి రాలేదని సమాచారం. అదే విధంగా జనసేనకు మచిలీపట్నం, కాకినాడ, అనకాపలి స్థానాలకు ఇవ్వటం దాదాపు ఖాయమైంది.
ఉమ్మడి కార్యాచరణ:సీట్ల సంఖ్య పైన ముందుగా నిర్ణయానికి వస్తే ఆ వెంటనే పాత్తు ప్రకటన ఉండనుంది. ఆ తరువాత మూడు పార్టీల నుంచి అభ్యర్దులు..ఉమ్మడి మేనిఫెస్టో పైన నిర్ణయం తీసుకోనున్నారు. ఈ వారాంతంలోగా పొత్తుల పైన ప్రకటనలు పూర్తి చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఆ వెంటనే రాయలసీమ నుంచి పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. సీట్లు దక్కని ఇరు పార్టీల నేతలతోనూ చంద్రబాబు, పవన్ కలిసి బుజ్జగించి..భవిష్యత్ పైన హామీ ఇచ్చేలా ఒక నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది. ఇదే సమయంలో మూడు పార్టీలు కలిసి ఉమ్మడిగా భారీ సభ నిర్వహించాలని ఆలోచన చేస్తున్నారు. ఢిల్లీ పర్యటనలో పొత్తు పైన తుది నిర్ణయం జరిగిన తరువాత భవిష్యత్ కార్యాచరణ ఖరారు చేయనున్నారు.
పొత్తుల్లో భాగంగా ఎవరి సీటు త్యాగం చేయాల్సి వస్తోందోననే భయం టిడిపి సీనియర్ నేతల్లో కనిపిస్తోంది. ప్రస్తుతం శాసనసభలో ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేలకు ఖచ్చితంగా సీటు ఇవ్వాల్సిందేనని సీనియర్లు పట్టుపడుతున్నారు. ఇదే సందర్బంలో టిడిపి సిట్టింగ్ స్ధానాలను బిజెపి, జనసేనకు కేటాయించాల్సి వస్తే సీనియర్ శాసనసభ్యుల రాజకీయ భవిష్యత్ ముగిసినట్లేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సిట్టింగు స్థానాలను త్యాగం చేసేందుకు టిడిపి సీనియర్లు అంగీకరించడం లేదని తెలిసింది. వారికి నచ్చజెప్పే పనిలో టిడిపి నాయకత్వం ఉంది.
-
14కు మార్కాపురం బస్సు ప్రమాద మృతులు.. ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సీఎం చంద్రబాబు! -
పవన్ ఉగ్రరూపం: ఎమ్మెల్యేలకు లాస్ట్ వార్నింగ్, ఇక యాక్షన్ తప్పదు -
తమిళనాడులో పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం.. విజయ్ కు బిగ్ షాక్..? -
చిరంజీవి, నాగబాబు గురించి పవన్ భార్య "అన్నా" సంచలన పోస్ట్..! -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..!












Click it and Unblock the Notifications