వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో ఐపీఎస్ ల బదిలీలు ..17 మంది అధికారులకు స్థానచలనం

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ లో ఒకపక్క రసవత్తర రాజకీయం కొనసాగుతుంటే ఏపీలో ఐపీఎస్ అధికారుల బదిలీలు ఆసక్తిగా మారాయి.17 మంది ఐపీఎస్ అధికారులకు స్థానచలనం కలిగించింది ఏపీ ప్రభుత్వం. ఇక వీరిలో విజయవాడ సి పి గా సేవలందిస్తున్న ద్వారకా తిరుమల రావును రైల్వేస్ డీజీపీగా బదిలీ చేశారు. ఇక ఆయన స్థానంలో విజయవాడ సిపి గా బి శ్రీనివాసులు నియమితులయ్యారు. బి శ్రీనివాసులు విజయవాడసిటీ అడిషనల్ పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు నిర్వర్తించారు.

IPS transfers in ap state ...17 officers displaced

ఏడీజీపీ ఆర్గనైజర్ గా ఎన్‌.బాలసుబ్రమణ్యం ను నియమించారు. ఇటీవల ఏర్పాటు చేసిన ఎస్ఈబీకి డైరెక్టర్ గా పీహెచ్డీ రామకృష్ణను, రోడ్ సేఫ్టీ అడిషనల్ డీజీపీగా క్రిపానంద త్రిపాఠి ఉజేలాను నియమించారు. ఇక శ్రీకాకుళం ఎస్పీగా అమిత్ బర్దార్, గుంటూరు అర్బన్ ఎస్పీగా అమ్మి రెడ్డి, విశాఖ శాంతి భద్రతల డిసిపిగా ఐశ్వర్య రస్తోగి, అడ్మిన్ ఏఐజి గా బిల్లా ఉదయభాస్కర్ లను బదిలీ చేశారు.

IPS transfers in ap state ...17 officers displaced

విశాఖ రూరల్ ఎస్పీగా బి కృష్ణారావును, విజయవాడ రైల్వేస్ ఎస్పీగా సిహెచ్ విజయ్ రామారావును నియమించారు. ఎస్ఐబీ ఎస్పీగా అట్టాడ బాబూజీ, పశ్చిమగోదావరి ఎస్పీగా కే నారాయణ నాయక్, సిఐడి ఎస్పి గా గ్రేవల్ నవదీప్ సింగ్ ను బదిలీ చేశారు. ఇక డీజీపీ ఆఫీస్ కు అటాచ్ చేస్తూ ఎస్ రంగారెడ్డికి ఉత్తర్వులు ఇచ్చారు. దీంతో ఆయన డీజీపీ ఆఫీసులో రిపోర్టు చేయవలసిందిగా తెలుస్తుంది .

English summary
The AP government has transfered 17 IPS officers. Dwarka Thirumala Rao, who is serving as Vijayawada CP, has been transferred to Railways DGP. B Srinivasulu was appointed as the Vijayawada CP. B. Srinivasulu has been worked as the addl Commissioner of Police in vijayawada city.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X