దసరాకు దక్షిణాది పుణ్యక్షేత్రాల యాత్ర-భారత్ గౌరవ్ రైల్లో- బుకింగ్స్ ఇలా..!
తెలుగు రాష్ట్రాల భక్తులకు దక్షిణాదిలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్ని వారం రోజుల్లో తిప్పి చూపించేలా ఐఆర్సీటీసీ ప్రత్యేక భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు ప్రకటించింది. ఈ నెల 23న తెలుగు రాష్ట్రాల నుంచి ప్రారంభమై ఎనిమిది రోజుల పాటు ఈ యాత్ర సాగనుంది. ఇందులో బుకింగ్స్ ఎలా చేసుకోవాలి, ఇతర వివరాలను రైల్వే అధికారులు ప్రకటించారు. దసరా సందర్భంగా పుణ్యక్షేత్రాల యాత్ర చేయాలనుకునే వారికి ఇది మంచి అవకాశం.
ఐఆర్ సీటిసీ సెప్టెంబర్ 23న తెలంగాణలోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి జ్యోతిర్లింగంతో దివ్య దక్షిణ యాత్ర కోసం భారత్ గౌరవ్ రైలును నడపనుంది. ఈ రైలు తిరువణ్ణామలైలోని అరుణాచలం ఆలయం, రామేశ్వరంలోని రామనాథస్వామి ఆలయం, మధురైలోని మీనాక్షి అమ్మన్ ఆలయం, కన్యాకుమారిలోని రాక్ స్మారక చిహ్నం, కుమారి అమ్మన్ ఆలయం, త్రివేండ్రంలోని శ్రీ పద్మనాభస్వామి ఆలయం, త్రిచిలోని శ్రీ రంగనాథస్వామి ఆలయం, తంజావూరులోని బృహదీశ్వర ఆలయాలను కలుపుతూ ప్రయాణించనుంది.

తెలంగాణలోని జనగాం , కాజీపేట , వరంగల్, మహబూబాబాద్ , ఖమ్మం, మధిర, ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, తెనాలి, ఒంగోలు , నెల్లూరు, గూడూరు, రేణిగుంట వంటి ముఖ్యమైన స్టేషన్లలో మార్గ మధ్యంలో ఇరువైపులా ప్రయాణికుల కోసం రైలు ఎక్కేందుకు , దిగేందుకు సౌకర్యం కల్పించారు. ఇందులో అన్ని ప్రయాణ సౌకర్యాలు (రైలు మరియు రోడ్డు రవాణాతో సహా), వసతి సౌకర్యం, క్యాటరింగ్ ఏర్పాట్లు (ఉదయం టీ, అల్పాహారం, లంచ్ మరియు డిన్నర్ - ఆన్-బోర్డు మరియు ఆఫ్-బోర్డ్ రెండూ), ప్రయాణం అంతటా వృత్తిపరమైన ,, స్నేహపూర్వక టూర్ ఎస్కార్ట్‌ల సేవలు, రైలులో భద్రత (సిసిటీవి కెమెరాలు) పబ్లిక్ అనౌన్స్మెంట్ సౌకర్యం , ప్రయాణ భీమా సౌకర్యాలు కల్పించారు.

భారత్ గౌరవ్ రైల్లో ఈ యాత్ర కోసం ఒక్కో ప్రయాణికుడికి ఎకానమీ విభాగంలో (స్లీపర్ కోచ్ ) రూ.14100 ఛార్జీగా నిర్ణయించారు. స్టాండర్డ్ విభాగంలో (ధర్డ్ ఏసీ) ఒక్కో ప్రయాణికుడికి రూ.22500గా నిర్ణయించారు. అలాగే కంఫర్ట్ కేటగిరీలో (2ఏసీ) ఒక్కొక్కరికి రూ.29500 ఛార్జీగా నిర్ణయించారు. బుకింగ్ కోసం : 9701360701, 9281030726, 9281030740, 9281495845 నంబర్లలో సంప్రదించాలని ఐఆర్సీటీసీ తెలిపింది.












Click it and Unblock the Notifications