అదిరిపోయిన అందాలు.. ఒక రోజులోనే..
ప్రయాణికులను ఆకట్టుకోవడానికి ఎప్పటికప్పుడు వారికి అందుబాటులో ఉండే ధరల్లో ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్ సీటీసీ) విహార యాత్రలు, పుణ్యక్షేత్రాల సందర్శన లాంటివి అందుబాటులోకి తెస్తుంటుంది. ఇందులో భాగంగానే తాజాగా ఒక్కరోజులో అరకు చూసిరావడానికి కార్పొరేషన్ ప్యాకేజీని అందిస్తోంది. విశాఖపట్నం నుంచి అరకు వెళ్లే రైలు ప్రతిరోజు అందుబాటులో ఉంటుంది. ఎప్పుడైనా టికెట్లు కొనుగోలు చేయొచ్చు.
ప్రకృతి దృశ్యాలు : విశాఖలో ఉదయం 6.45 గంటలకు రైలు (నెం. 08551) బయలుదేరుతుంది. వంతెనలు, సొరంగాలు, ప్రకృతి దృశ్యాలను తిలకిస్తూ 10.55 గంటలకు అరకు చేరుకుంటుంది. అక్కడి నుంచి అరకు లోయకు వెళ్లి వీక్షించడంతోపాటు ఆదివాసీ మ్యూజియం, చాపరాయి, గార్డెన్స్ చూస్తారు. భోజనం ముగిసిన తర్వాత విశాఖకు వెళతారు. తిరుగు ప్రయాణం రోడ్డు మార్గంలో ఉంటుంది. విశాఖ రైల్వేస్టేషన్, సిటీ లిమిట్స్ చేరుకోవడంతో యాత్ర ముగుస్తుంది. అనంగిరి కాఫీ తోటలు, గాలికొండ వ్యూ పాయింట్, బొర్రా గుహలను చూస్తారు.

ఏసీ బస్సులో : ఏసీ బస్సు సదుపాయంతోపాటు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, టీ సంస్థ అందిస్తుంది. అలాగే బొర్రా గుహల రుసుము కూడా ఐఆర్ సీటీసీనే అందిస్తుంది. మిగతావాటికి ప్రయాణికులే చెల్లించుకోవాలి. ప్రయాణ బీమా ఉంటుంది. పెద్దలకు రూ.2130, 5-11 సంవత్సరాల మధ్య చిన్నారులకు రూ.1760 చెల్లించాలి. స్టాండర్డ్ కేటగిరిలో అయితే రూ.2385, చిన్నారులకు రూ.1915, ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ లో పెద్దలకు రూ.4450, చిన్నారులకు రూ.4080 చెల్లించాలి. ప్రయాణానికి 15 రోజుల ముందుగా టికెట్ రద్దు చేసుకుంటే మొత్తంలో రూ.250 మినహాయిస్తారు. నాలుగు రోజుల ముందు ప్రయాణంవద్దనుకుంటే ఎటువంటి చెల్లింపులు ఉండవు.












Click it and Unblock the Notifications