నోడౌట్... దిస్ ఈజ్ ద బెస్ట్ ప్యాకేజ్

తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామివారిని దాదాపు ప్రతి ఒక్కరూ తమ కుటుంబ సభ్యులతో కలిసి ఏడాదికి ఒక్కసారన్నా దర్శనం చేసుకుంటుంటారు. తిరుపతితోపాటు చుట్టుపక్కల ప్రాంతాలను కూడా సందర్శించి వచ్చేలా ఇండియన్ రైల్వే క్యాటరింగ్ కొత్త ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది. ఇది ప్రతిరోజు అందుబాటులో ఉంటుంది. 3 రాత్రులు, నాలుగు పగళ్లు ఉండేలా దీన్ని రూపొందించారు. శ్రీవారి దర్శనం తర్వాత బస్సులో తిరుచానూరు, శ్రీకాళహస్తి, కాణిపాకం లాంటి సందర్శనీయ ప్రాంతాలను కూడా దర్శించుకుంటారు.

మొదటి రోజు లింగంపల్లిలో సాయంత్రం 5.25 గంటలకు రైలు ఎక్కాలి. రాత్రంతా ప్రయాణం చేసి తెల్లవారుజామున 5:55 గంటలకు తిరుపతికి చేరుకుంటారు. అక్కడ ఐఆర్‌సీటీసీ సిబ్బంది పర్యాటకుల్ని హోటల్‌కు తీసుకెళ్తారు. తర్వాత శ్రీనివాస మంగాపురం, కాణిపాకం, శ్రీకాళహస్తి, తిరుచానూరు ఆలయాల సందర్శన ఉంటుంది. రాత్రికి తిరుపతిలో బస. మూడో రోజు ఉదయం 8.30 గంటలకు తిరుమలలో ప్రత్యేక ప్రవేశ దర్శనం ద్వారా శ్రీవారి దర్శనం ఉంటుంది. అదే రోజు సాయంత్రం 6.25 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరతారు.

irctc tirupathi tour package details

రాత్రంతా ప్రయాణం చేసి లింగంపల్లికి ఉదయం 6.55 గంటలకు చేరుకుంటారు. అక్కడితో టూర్ ప్యాకేజీ ముగుస్తుంది. ఐఆర్‌సీటీసీ పూర్వ సంధ్య టూర్ ప్యాకేజీ పేరుతో ఇది అందుబాటులో ఉంటుంది. ప్రారంభ ధర రూ.5,660. స్టాండర్డ్‌లో ట్రిపుల్ ఆక్యుపెన్సీ ప్యాకేజీ ధర.. డబుల్ ఆక్యుపెన్సీకి రూ. 5860, సింగిల్ ఆక్యుపెన్సీకి రూ. 7720 చెల్లించాలి. ఐఆర్‌సీటీసీ వెబ్ సైట్ లో పూర్తి వివరాలుంటాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+