బాబుకు షాకిస్తారా: పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగాక.. జనసేనతో టచ్‌లో బోండా ఉమ?
రానున్న సార్వత్రిక జనసేన పార్టీ ఒంటరిగా పోటీ చేసినా, లెఫ్ట్ పార్టీలతో కలిసి పోటీ చేసినా టిడిపి, వైసిపిల నుంచి పెద్ద ఎత్తున అసంతృప్తులు పవన్ కళ్యాణ్ వైపు వెళ్లడం ఖాయం.
విజయవాడ: రానున్న సార్వత్రిక జనసేన పార్టీ ఒంటరిగా పోటీ చేసినా, లెఫ్ట్ పార్టీలతో కలిసి పోటీ చేసినా టిడిపి, వైసిపిల నుంచి పెద్ద ఎత్తున అసంతృప్తులు పవన్ కళ్యాణ్ వైపు వెళ్లడం ఖాయం. దాదాపు ఒంటరి పోరుకే జనసేనాని సిద్ధమవుతున్నారు.
చదవండి: పీకే సర్వే.. పాదయాత్రపై జగన్ రివర్స్ గేర్?: 'భారీ ఆపరేషన్'కు పక్కా స్కెచ్

టిడిపిపై పవన్ కళ్యాణ్ ఇలా..
కానీ రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. పవన్ కళ్యాణ్ మాటల తీరు కొన్ని సందర్భాల్లో టిడిపికి అనుకూలంగా, వ్యతిరేకంగా కనిపిస్తోంది. అంటే ప్రస్తుతం ఆయన అంశాల వారిగా బాబు పాలనపై స్పందిస్తున్నారని చెప్పవచ్చు.
Recommended Video


బోండా ఉమ జనసేన వైపు చూస్తున్నారా?
ఈ నేపథ్యంలో బెజవాడ రాజకీయాల్లో ఇప్పుడు ఓ ఆసక్తికర చర్చ సాగుతోంది. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వర రావు ఇప్పుడే జనసేన వైపు చూస్తున్నారని అంటున్నారు. తనకు ఇటీవల జరిగిన కేబినెట్ విస్తరణలో చోటు దక్కుతుందని బోండా భావించారు. ఇప్పుడు పార్టీలోను పదవి దక్కలేదు.

బోండా ఉమకు వరుస షాక్‌లు
వరుసగా తనకు తగులుతున్న షాక్‌లపై పార్టీ అధిష్టానంపై బోండా ఉమ తీవ్ర అసంతృప్తితో ఉన్నారని అంటున్నారు. కేబినెట్లో చోటు దక్కనప్పుడే.. కాపులకు పార్టీలో అన్యాయం జరుగుతోందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత చల్లబట్టారు. ఇప్పుడు పార్టీ పదవుల్లోను ప్రాధాన్యత దక్కలేదు. అంతేకాదు, వచ్చే ఎన్నికల్లో టిడిపి నుంచి టిక్కెట్ దక్కే విషయంలోను ఆయనకు అనుమానాలున్నాయట.

పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగాక..
ఈ నేపథ్యంలో బోండా ఉమ జనసేన వైపు అడుగులు వేసే ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం సాగుతోంది. ఆయన పవన్ కళ్యాణ్‌తో టచ్‌లో ఉన్నారట. జనసేనాని పూర్తిస్థాయిగా జనాల్లోకి వచ్చాక, ఆయన ఏం చేస్తారనే విషయం తేలాక బోండా ఓ షాకింగ్ నిర్ణయం తీసుకున్నా ఆశ్చర్యం లేదంటున్నారు.












Click it and Unblock the Notifications