వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పీకే సర్వే.. పాదయాత్రపై జగన్ రివర్స్ గేర్?: 'భారీ ఆపరేషన్'కు పక్కా స్కెచ్

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రపై వివిధ రకాల ఊహాగానాలు వస్తున్నాయి. తాజాగా మరో షాకింగ్ ప్రచారం సాగుతోంది.

|
Google Oneindia TeluguNews

Recommended Video

YS Jagan tour in districts instead of Padayatra? పాదయాత్రపై జగన్ రివర్స్ గేర్ | Oneindia Telugu

అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రపై వివిధ రకాల ఊహాగానాలు వస్తున్నాయి. తాజాగా మరో షాకింగ్ ప్రచారం సాగుతోంది.

చదవండి: జూ.ఎన్టీఆర్‌కు బాబు సంకేతాలు, ముందుచూపు: హరికృష్ణకు కోపంవస్తే

పాదయాత్రపై డైలమాలో ఉన్న జగన్ ఇప్పుడు జిల్లాల యాత్ర ప్రారంభించబోతున్నట్లుగా ప్రచారం సాగుతోంది. ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరు కావాలంటే పాదయాత్రకంటే జిల్లాల పర్యటనలే ఉత్తమమని వైసిపి నేతలు భావిస్తున్నారని తెలుస్తోంది.

చదవండి: బాబుకు ఓ 'పీకే', లగడపాటి సీక్రెట్: జగన్-ప్రశాంత్ కిషోర్‌లకు చెక్?

వైసిపి కేడర్‍‌లో ఆందోళన

వైసిపి కేడర్‍‌లో ఆందోళన

జిల్లాల పర్యటనలో జగన్ ఏం చేయాలనే అంశంపై ప్రస్తుతం వైసిపిలో కరసత్తు సాగుతోందని అంటున్నారు. పాదయాత్ర, వాయిదా, జిల్లాల పర్యటన.. అంటూ ప్రచారం సాగుతున్న నేపథ్యంలో వైసిపి కేడర్‌కు ఏం అర్థం కావడం లేదని, వారిలోను డైలమా కనిపిస్తోందని అంటున్నారు. జిల్లాల పర్యటన ప్రారంభిస్తే, పాదయాత్ర ఎప్పుడు ఉంటుంది అనే చర్చ కూడా సాగుతోంది.

అలా నమ్మకం సడలిపోయి

అలా నమ్మకం సడలిపోయి

ఆరు నెలల పాటు పాదయాత్ర చేసి ప్రజలకు మరింత చేరువ కావాలని జగన్ భావించారు. కానీ ప్రతి శుక్రవారం వ్యక్తిగతంగా కోర్టులో హాజరు కావాల్సిందేనని న్యాయస్థానం చెప్పడంతో పాదయాత్రపై డైలమా కనిపిస్తోంది. కోర్టుకు వెళ్లి జగన్ అనుమతి తెచ్చుకొని, పాదయాత్ర కొనసాగిస్తారని వైసిపి కేడర్ భావించింది. కానీ కేసుల కారణంగా పాదయాత్ర సాధ్యం కాదని వైసిపి నేతలు అంతిమంగా భావిస్తున్నారని సమాచారం.

అలా చేయడం ఇబ్బంది, ప్రశాంత్ కిషోర్ సూచన

అలా చేయడం ఇబ్బంది, ప్రశాంత్ కిషోర్ సూచన

ఈ నేపథ్యంలో పాదయాత్రను ఇంకొన్నాళ్లు వాయిదా వేయడమే మంచిదని వైసిపి భావిస్తోందని తెలుస్తోంది. పాదయాత్ర చేస్తూ ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరై వెళ్లడం ఇబ్బందితో కూడుకున్న పనిగా భావిస్తున్నారు. కాబట్టి కోర్టు నుంచి ఓ వైపు అనుమతి కోసం ప్రయత్నిస్తూనే మరోవైపు జిల్లాల పర్యటన చేస్తే బాగుంటుందని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌తా పాటు మరికొందరు సలహా ఇచ్చారని తెలుస్తోంది.

పాదయాత్రపై మరోసారి ఆలోచన

పాదయాత్రపై మరోసారి ఆలోచన

కోర్టు నుంచి వ్యక్తిగత హాజరు మినహాయింపు వస్తేనే పాదయాత్ర గురించి మరోసారి ఆలోచన చేయాలనే ఉద్దేశంలో జగన్ ఉన్నారని అంటున్నారు. ప్రశాంత్ కిషోర్ కూడా అదే బెస్ట్ అని చెప్పినట్లుగా తెలుస్తోంది. పాదయాత్రకు బదులు.. ఇప్పటికిప్పుడు ఏం చేస్తే బాగుంటుందని ప్రశాంత్ కిషోర్, ఇతర సీనియర్ నేతలతో చర్చించాక.. జిల్లాల పర్యటన బెట్టర్ అని నిర్ణయించినట్లుగా ప్రచారం సాగుతోంది.

జిల్లా నేతలకు ఆదేశాలు, గందరగోళంలో నేతలు

జిల్లా నేతలకు ఆదేశాలు, గందరగోళంలో నేతలు

జగన్ పాదయాత్ర కంటే ముందు జిల్లాల పర్యటన ఉంటుందని వైసిపి అధిష్టానం నుంచి జిల్లా నాయకులకు సమాచారం అందినట్లుగా కూడా చెబుతున్నారు. జగన్ జిల్లాల పర్యటనలకు ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పారని తెలుస్తోంది. హఠాత్తుగా జిల్లాల పర్యటన అంటుండటంతో నేతలు కూడా గందరగోళ పడుతున్నారని అంటున్నారు.

జిల్లా పర్యటనల్లో ఇలా.. పీకే టీం సర్వే రిపోర్టులు

జిల్లా పర్యటనల్లో ఇలా.. పీకే టీం సర్వే రిపోర్టులు

జిల్లా పర్యటనల్లో పార్టీ పరంగా చేపట్టిన కార్యక్రమాలను ఆయా జిల్లాల నేతలు ఎంతమేర నిర్వహించారో తెలుసుకోనున్నారని తెలుస్తోంది. అలాగే, ఇప్పటికే ప్రశాంత్ కిషోర్ టీమ్ సర్వేలో తేలిన విషయాలను వారి ముందు ఉంచనున్నారని తెలుస్తోంది. పీకే సర్వే రిపోర్టు ఆధారంగా సమీక్ష నిర్వహించనున్నారని అంటున్నారు.

7 ఆపరేషన్ ఆకర్ష్.. జగన్ వ్యూహం ఇదేనా?

7 ఆపరేషన్ ఆకర్ష్.. జగన్ వ్యూహం ఇదేనా?

జగన్ పాదయాత్ర సమయంలో పెద్ద ఎత్తున నేతలు వైసిపిలో చేరుతారని భావించారు. కానీ నంద్యాల, కాకినాడ ఫలితాల తర్వాత నేతలు లెక్కలు వేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పాదయాత్రను వాయిదా వేసి, జిల్లాల పర్యటనతో వారిని తిరిగి ఆకర్షించాలనే వ్యూహంతో జగన్ ఉన్నారని, ఇందుకోసం ఆయన పక్కా స్కెచ్ వేశారని అంటున్నారు. పాదయాత్ర సమయంలో భారీ సంఖ్యలో నాయకులను చేర్చుకునేందుకు అంతకుముందు ఆయన జిల్లాల పర్యటన తోడ్పడుతుందని భావిస్తున్నారు. కోర్టు అనుమతి వచ్చాక, పాదయాత్ర సమయంలో తిరిగి వారు చేరుతారని అంటున్నారు.

English summary
Will YSR Congress Party chief YS Jaganmohan Reddy tour in districts insteat of Padayatra?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X