వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీఎం జగన్‌కు బాబు రాసిన మొదటి లేఖపై విజయసాయి సెటైర్లు.. ప్రజా సమస్యలపై కాదా...

|
Google Oneindia TeluguNews

విజయసాయి రెడ్డి చంద్రబాబు అంటేనే అగ్గి మీద గుగ్గిలం అయ్యే నేత .. వైసీపీ ఎంపీగా , జగన్ కు సన్నిహితుడిగా పార్టీలో ముఖ్య నాయకుడిగా ఉన్న విజయ్ సాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా చంద్రబాబును ఎన్నికల సమయంలో ట్విట్టర్ వేదికగా తిట్టిపోశారు . ఏపీలో అధికారంలోకి వైసీపీ వచ్చిన తర్వాత కూడా చంద్రబాబును బాగా గట్టిగానే టార్గెట్ చేస్తున్నారు . అందులో భాగంగా తాజాగా చంద్రబాబు ఏపీ సీఎం జగన్ కు ప్రజా వేదిక గురించి రాసిన లేఖపైన పై మరోమారు ట్వీట్లతో దాడి చేశారు.

చంద్రబాబును ఎద్దేవా చేసిన విజయసాయి .. చంద్రబాబు లేఖపై కౌంటర్

చంద్రబాబును ఎద్దేవా చేసిన విజయసాయి .. చంద్రబాబు లేఖపై కౌంటర్

వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి తాజాగా ట్విట్టర్ ద్వారా చేసిన ట్వీట్లలో చంద్రబాబును ఎద్దేవా చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై మరోసారి విమర్శలు గుప్పించారు. చంద్రబాబు నాయుడు లేఖపై వైఎస్సార్ సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సీఎం జగన్‌కు చంద్రబాబు రాసే మొదటి లేఖ ప్రజా సమస్యలపై ఉంటుందని భావించామని చెప్పుకొచ్చారు. ప్రతిపక్ష నాయకుడికి ప్రజా సమస్యలు పట్టవని , అమరావతిలోని విలాస భవనంపై చంద్రబాబుకు చింత పట్టుకుందని ఎద్దేవా చేశారు. ప్రపంచం మొత్తాన్ని అమరావతికి రప్పిస్తానని అన్న వ్యక్తికి సొంత ఇల్లు కట్టుకునే ఆలోచన లేదా అంటూ చంద్రబాబుకు విజయసాయి రెడ్డి చురకలు అంటించారు.

 జగన్ పై ప్రసంశల వెల్లువ .. అవినీతికి ఆస్కారం లేని పాలన అందిస్తారని కితాబు

జగన్ పై ప్రసంశల వెల్లువ .. అవినీతికి ఆస్కారం లేని పాలన అందిస్తారని కితాబు

మరోవైపు సీఎం జగన్ పై ప్రశంసలు కురిపించారు. ఇటీవల రాసిన టెండర్లలో అవినీతికి ఆస్కారం లేకుండా సిట్టింగ్ హైకోర్టు జడ్జి ఆధ్వర్యంలో జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు సాహసోపేత నిర్ణయమంటూ కొనియాడారు. కొన్ని సందర్భాల్లో విశ్రాంత న్యాయమూర్తులతో విచారణ చేయించడం చూశామని, ఇప్పుడు నిరంతరం స్క్రూటినీ ఉంటుందన్నారు. ఇది జగన్ గారి పాలనకు నిదర్శనం అని విజయసాయి కొనియాడారు. అంతే కాదు ఐపిఎస్ ను తాకట్టు పెట్టిన కొందరు అధికారులు పోలీసు శాఖను టీడీపీ అనుబంధ విభాగంగా మార్చారని ఇంకో ట్వీట్ లో పేర్కొన్నారు . ప్రజలకు జవాబుదారిగా ఉండే అత్యుత్తమ వ్యవస్థను సృష్టించే పనిలో జగన్ గారు మొదటి అడుగు వేశారు. అధికార పార్టీ వారిని ఒకలా, సాధారణ ప్రజలను మరోలా చూసే రోజులకు చెల్లు అంటూ పోలీస్ శాఖపై మరో సంచలన ట్వీట్ చేశారు.

పీఠాధిపతులు ఎలా వ్యవహరించాలో కూడా మీరే నిర్ణయిస్తారా అని మండిపాటు

పీఠాధిపతులు ఎలా వ్యవహరించాలో కూడా మీరే నిర్ణయిస్తారా అని మండిపాటు

ఇకపోతే వైయస్ జగన్ శారదా పీఠాన్ని సందర్శించడంపై యెల్లో చానల్ ఒకటి చర్చపెట్టిందని చెప్పుకొచ్చారు. కుల మీడియా పెద్దాయన ఒకరు మాట్లాడుతూ స్వాములు ఎవరిని ముట్టుకోరు ఆలింగనం ఎలా చేసుకుంటారని, ముద్దులు పెడతారా అని తన అజ్ణానాన్ని, ఏడుపును ప్రదర్శించారుని ధ్వజమెత్తారు. పీఠాధిపతులు ఎలా వ్యవహరించాలో కూడా వీరే నిర్ణయిస్తారా అంటూ మండిపడ్డారు ఎంపీ విజయసాయిరెడ్డి.

English summary
Ever since YCP stormed to power with a thumping victory, Vijay Sai Reddy has launched an all-round attack on Chandrababu Naidu and his governance. In a fresh accusation, Vijay Sai Reddy alleged that TDP chief Chandra Babu wrote a letter to CM Jagan , and vijayasai reddy thought that the first letter written by Chandrababu on public issues. Opposing the public problems of the Opposition leader, Chandra Babu was worried about the luxury building vijayasai countered chandrababu .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X